తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lowest T20 Score: 10 పరుగులకే కుప్పకూలారు.. టీ20ల్లో లోయెస్ట్ స్కోరు ఇదే

Lowest T20 Score: 10 పరుగులకే కుప్పకూలారు.. టీ20ల్లో లోయెస్ట్ స్కోరు ఇదే

Hari Prasad S HT Telugu

27 February 2023, 19:04 IST

    • Lowest T20 Score: 10 పరుగులకే కుప్పకూలారు. టీ20ల్లో లోయెస్ట్ స్కోరు నమోదు చేశారు. ఇదేదో గల్లీ క్రికెట్ లో జరిగింది కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో నమోదైన స్కోరు.
ప్రత్యర్థి ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టును 10 పరుగులకు కుప్పకూల్చిన స్పెయిన్ టీమ్ ఇదే
ప్రత్యర్థి ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టును 10 పరుగులకు కుప్పకూల్చిన స్పెయిన్ టీమ్ ఇదే

ప్రత్యర్థి ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టును 10 పరుగులకు కుప్పకూల్చిన స్పెయిన్ టీమ్ ఇదే

Lowest T20 Score: ఈ టీ20 క్రికెట్ ఎరాలో టన్నుల కొద్దీ పరుగులు నమోదవుతున్నాయి. కానీ అప్పుడప్పుడూ క్రికెట్ లో పసికూనలుగా ఉన్న టీమ్స్ మరీ దారుణమైన రికార్డులను కూడా నమోదు చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో రికార్డు నమోదు కావడం విశేషం. ఈసారి టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు రికార్డు క్రియేటైంది. ఈ చెత్త రికార్డును మూట గట్టుకున్న టీమ్ పేరు ఐల్ ఆఫ్ మ్యాన్.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

స్పెయిన్ తో ఆదివారం (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ లో ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్ కేవలం 10 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. ఆ తర్వాత ఈ టార్గెట్ ను స్పెయిన్ కేవలం రెండే రెండు బంతుల్లో చేజ్ చేసేసింది. 118 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గతంలో ఈ లోయెస్ట్ స్కోరు రికార్డు 21 పరుగులతో టర్కీ పేరిట ఉండేది. 2019లో చెక్ రిపబ్లిక్ పై ఈ రికార్డు నమోదైంది.

తాజా మ్యాచ్ లో ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే కుప్పకూలింది. టీమ్ లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్, ఆతిఫ్ మెహమూద్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఇందులో కమ్రాన్ ఓ హ్యాట్రిక్ కూడా తీసుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్పెయిన్ తొలి బంతి నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టింది.

ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్ లో జోసెఫ్ బరోస్ 4 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఫ్రేజర్ క్లార్క్ అనే బ్యాటర్ 12 బంతులు ఆడినా.. చివరికి డకౌటయ్యాడు. అతడొక్కడే రెండు ఓవర్లు ఆడటంతో ఐల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ వరకూ సాగింది.

ఇక చేజింగ్ అయితే రెండు జట్లు బౌండరీ బయట నుంచి క్రీజు వరకూ వచ్చేంత సమయం కూడా పట్టలేదు. జోసెఫ్ బౌలింగ్ ప్రారంభించగా.. తొలి బంతే నోబాల్ వేశాడు. తర్వాతి రెండు బంతులను అవైస్ అహ్మద్ రెండు సిక్స్ లుగా మలచడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను స్పెయిన్ 5-0తో గెలవడం విశేషం.

టాపిక్