తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Womens T20 World Cup 2023 Winner: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఆస్ట్రేలియా - డ‌బుల్ హ్యాట్రిక్ టైటిల్ సొంతం

womens t20 world cup 2023 winner: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఆస్ట్రేలియా - డ‌బుల్ హ్యాట్రిక్ టైటిల్ సొంతం

27 February 2023, 7:08 IST

  • womens t20 world cup 2023 winner: ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న‌ది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో సౌతాఫ్రికాపై 19 ప‌రుగులు తేడాతో ఆస్ట్రేలియా విజ‌యాన్ని సాధించింది.

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా
ఆస్ట్రేలియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా

womens t20 world cup 2023 winner: ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో సౌతాఫ్రికాపై 19 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ విజ‌యంతో మొత్తంగా ఆరోసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 156 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మూనే 53 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 74 ర‌న్స్ చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించింది. గార్డ్‌న‌ర్ 29 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ఇస్మాయిల్, కాప్ప్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బ‌డిన సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు ఇర‌వై ఓవ‌ర్ల‌లో 137 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను ఎదురిస్తూ ఓపెన‌ర్ లారా ఒంట‌రి పోరాటం చేసినా మిగిలిన వారి నుంచి స‌హ‌కారం అంద‌క‌పోవ‌డంతో సౌతాఫ్రికా ఓట‌మి పాలైంది.

లారా 48 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 61 ర‌న్స్ చేసింది. ట్రాయ‌న్ 25 ప‌రుగులు చేయ‌గా మిగిలిన బ్యాట్స్ ఉమెన్స్ విఫ‌ల‌మ‌య్యారు. అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన మూనేకు ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్క‌గా గార్డ్‌న‌ర్‌ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది.

తదుపరి వ్యాసం