Lowest Score in T20 Cricket: టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు.. 15 పరుగులకే ఆలౌట్-sydney thunder register lowest score 15 runs ever t20 total in history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lowest Score In T20 Cricket: టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు.. 15 పరుగులకే ఆలౌట్

Lowest Score in T20 Cricket: టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు.. 15 పరుగులకే ఆలౌట్

Maragani Govardhan HT Telugu
Dec 16, 2022 10:14 PM IST

Lowest Score in T20 Cricket: బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఇదే అత్యంత అత్యల్ప స్కోరు

15 పరుగులకే సిడ్నీ ఆలౌట్
15 పరుగులకే సిడ్నీ ఆలౌట్ (BBL)

Lowest Score in T20 Cricket: రికార్డులున్నది బద్దలు కొట్టడానికే అన్నట్లుగా.. మంచి ప్రదర్శనలతోనే కాదు.. చెత్త ప్రదర్శనలతోనూ రికార్డులు సృష్టించవచ్చు. తాజాగా టీ20 క్రికెట్ చరిత్రనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఇందుకు ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్‌ బాష్ లీగ్ వేదికైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ అత్యంత దారుణమైన ప్రదర్శన చేశారు. 5.5 ఓవర్లలో కేవలం 15 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది సిడ్నీ జట్టు. ఈ టీమ్‌లో ఒక్కరంటే ఒక్కరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరు చేయకపోవడం గమనార్హం. ఫలితంగా టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లిన్(36), గ్రాండ్‌హోమ్(33) రాణించడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ జట్టు 5.5 ఓవర్లలో 15 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డోగెట్ ఒక్కడే 4 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ చేయలేకపోయారు. మొత్తం ఐదుగురు ఆటగాళ్ల డకౌట్‌గా నిలిచారు. అడిలైడ్ బౌలర్లలో హెన్రీ థ్రోంటన్ కేవలం 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... వెస్ అగర్ 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా అడిలైడ్ జట్టు 124 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 క్రికెట్‌లో అత్యల్ప స్కోర్లు..

సిడ్నీ థండర్స్ VS అడిలైడ్ స్ట్రైకర్స్ - 15

టర్కీ VS చెక్ రిపబ్లిక్ - 21

లిస్తో VS ఉగండా - 26

టర్కీ VS లక్సంబర్గ్ - 28

బిగ్‌బాష్ లీగ్‌లో ఇంతకు ముందు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ సాధించిన 57 పరుగులే అత్యల్ప స్కోరు. తాజాగా సిడ్నీ థండర్స్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన మూడో బంతికే సిడ్నీ పతనం ప ప్రారంభమైంది. ఆ తదపరి ఓవర్‌లో జాసన్ సంగ్తా, హేల్స్ వికెట్లను కూడా తీసింది. నాలుగో ఓవర్ ఆఖరున సిడ్నీ థండర్ తన ఆరో వికెట్‌ను కోల్పోయింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్