తెలుగు న్యూస్  /  Sports  /  Kohli Gifts Bmw Car To Kl Rahul And Dhoni Gifts Him A Costly Bike

Kohli gifts BMW car to KL Rahul: కోహ్లి నుంచి బీఎండబ్ల్యూ కారు.. ధోనీ నుంచి ఖరీదైన బైక్.. రాహుల్‌కు పెళ్లి కానుకలు

Hari Prasad S HT Telugu

25 January 2023, 20:47 IST

    • Kohli gifts BMW car to KL Rahul: కోహ్లి నుంచి బీఎండబ్ల్యూ కారు.. ధోనీ నుంచి ఖరీదైన బైక్ అందుకున్నాడు కొత్త పెళ్లి కొడుకు కేఎల్ రాహుల్‌. తమ సహచర క్రికెటర్‌కు పెళ్లి కానుకగా వాళ్లు వీటిని పంపినట్లు వార్తలు వస్తున్నాయి
అతియా శెట్టి, కేెఎల్ రాహుల్
అతియా శెట్టి, కేెఎల్ రాహుల్ (K L Rahul Twitter)

అతియా శెట్టి, కేెఎల్ రాహుల్

Kohli gifts BMW car to KL Rahul: విరాట్ కోహ్లి, ఎమ్మెస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ పై తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరూ అదే క్రికెట్ ద్వారా వేల కోట్లు సంపాదించారు. ఈ ప్లేయర్స్ చిటికేస్తే కోట్లు రాలుతాయి. మరి అలాంటి ప్లేయర్స్ సహచర క్రికెటర్ కు పెళ్లి కానుకగా ఏమిస్తారు? వాళ్ల స్థాయికి తగిన కానుకలనే వాళ్లు కొత్త పెళ్లి కొడుకు కేఎల్ రాహుల్ కు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గత సోమవారం (జనవరి 23) ఖండాలాలో తన గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో టీమిండియా ప్లేయర్స్ బిజీగా ఉన్నారు. దీంతో ఎవరూ రాహుల్ పెళ్లికి వెళ్లలేకపోయారు. కానీ ఖరీదైన బహుమతుల రూపంలో వాళ్లు తమ విషెస్ పంపినట్లు సమాచారం.

రాహుల్ కు విరాట్ కోహ్లి ఏకంగా రూ.2.17 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చాడట. ఇక మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ కూడా తక్కువేమీ కాదు. అతనికి ఖరీదైన బైకులంటే ఇష్టం కదా. అందుకే గిఫ్ట్ గా కూడా అలాంటి బైక్ నే రాహుల్ కు ఇచ్చాడు. రూ.80 లక్షల విలువైన కవాసకీ నింజా బైక్ ను ధోనీ కానుకగా ఇచ్చినట్లు తెలిసింది.

సహచర క్రికెటర్ల నుంచే కాదు.. అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నుంచి కూడా రాహుల్ అత్యంత ఖరీదైన బహుమతి అందుకున్నాడు. సునీల్ తన కూతురు, అల్లుడి కోసం ముంబైలో రూ.50 కోట్ల విలువ చేసే అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఇవ్వడం విశేషం. ఇవే కాకుండా ఈ కొత్త జంటకు సల్మాన్ ఖాన్ నుంచి ఆడి కారు, జాకీ ష్రాఫ్ నుంచి ఖరీదైన వాచ్ లు కానుకలుగా వచ్చాయట.

ఇక త్వరలోనే టీమిండియా క్రికెటర్ల కోసం రాహుల్ దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఖండాలాలో జరిగిన వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. రాహుల్, అతియా కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని సీక్రెట్ గానే ఉంచినా.. గతేడాది నుంచి పబ్లిగ్గా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు మొత్తానికి ఓ ఇంటివాళ్లయ్యారు.