IND Vs NZ T20 : కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్!-ind vs nz t20 cricketer rutraj gaikwad facing proble with wrist pain check into national cricket academy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /   Ind Vs Nz T20 Cricketer Rutraj Gaikwad Facing Proble With Wrist Pain Check Into National Cricket Academy

IND Vs NZ T20 : కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్!

Anand Sai HT Telugu
Jan 24, 2023 09:12 PM IST

IND vs NZ T20 : న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్ మెుదలుకావడానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది..!

టీమిండియా
టీమిండియా (AP)

IND Vs NZ T20 : న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. అయితే టీమిండియా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కివీస్‌తో వన్డే సిరీస్ ముగిసింది. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు తలపడనుంది. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సిరీస్ లోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

టీమ్ ఇండియా టీ20లో అత్యంత కీలక ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో సిరీస్ ఆడటంపై సందేహం నెలకొంది. గైక్వాడ్ మణికట్టు నొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. చికిత్స కోసం వెళ్లినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రుతురాజ్‌కు ఈ గాయం అయినట్లు సమాచారం.

న్యూజిలాండ్‌తో జనవరి 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, గైక్వాడ్ సరైన సమయానికి ఫిట్‌గా రాకపోతే ఈ సిరీస్‌కు ఎంపికైన పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2021 శ్రీలంక పర్యటనలో భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేదు. వెన్ను గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే NCAలో శిక్షణ పొందుతున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న 4 టెస్టుల సిరీస్‌లో తొలి 2 టెస్టుల కోసం అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గైక్వాడ్ రాణించలేకపోవచ్చు. అయితే ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో తమిళనాడుపై 195 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీలు సాధించాడు. గత 10 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు చేశాడు గైక్వాడ్.

టీం ఇండియా టీ20 టీమ్‌లో కీలక ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

WhatsApp channel