Athiya Shetty Lehenga : అతియా శెట్టి లెహంగా తయారీకి 10 వేల గంటలా?-athiya shetty wedding wear lehenga design goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Athiya Shetty Wedding Wear Lehenga Design Goes Viral

Athiya Shetty Lehenga : అతియా శెట్టి లెహంగా తయారీకి 10 వేల గంటలా?

Anand Sai HT Telugu
Jan 24, 2023 07:28 PM IST

KL Rahul Athiya Shetty Wedding : క్రికెటర్ కేఎల్ రాహుల్-బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈ నెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా అతియా శెట్టి లెహంగా తయారీకి పట్టిన సమయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అతియా శెట్టి, కేఎల్ రాహుల్
అతియా శెట్టి, కేఎల్ రాహుల్

టీమ్ ఇండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ న‌టి అతియాశెట్టి మెడ‌లో సోమ‌వారం మూడుముళ్లు వేశాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. రాహుల్‌, అతియాశెట్టి పెళ్లి వేడుక‌ ఖండాలాలోని సునీల్‌శెట్టి ఫామ్ హౌజ్‌లో జ‌రిగింది. పెళ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ వేడుకలో అతియా శెట్టి ధరించిన లెహంగా అందరినీ ఆకట్టుకుంది. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లెహంగా ఫొటోల్లో అతియా మెరిసిపోతోంది. అయితే దీనికి స్పెషాలిటీ ఉంది. అతియా ధరించిన లెహంగాను తయారు చేసేందుకు ఎంత సమయం పట్టిందో తెలుసా.. పదివేల గంటలపాటు కష్టపడి తయారుచేశామని డిజైనర్ తెలిపింది.

'అతియా చాలా అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం లెహంగాను ప్రత్యేకంగా తయారు చేశాం. అతియా ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని డిజైనర్ అనామిక తెలిపింది.

టీమిండియా స్టార్ క్రికెట్ర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి సుమారు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. వీరి వివాహ వేడుక మహారాష్ట్రలోని ఖండాలలో తక్కువ మంది అతిథుల మధ్య జరిగింది. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం, ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్లు చేయడం ద్వారా వీరు తమ బంధాన్ని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉన్నారు. ఇక ఇద్దరు ఒక ఇంటి వారయ్యారు.

IPL_Entry_Point

టాపిక్