తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Iran Vs Wales Fifa World Cup 2022: వేల్స్‌పై ఇరాన్ థ్రిల్లింగ్ విజయం.. చివర్లో అద్భుతం

Iran vs Wales FIFA World Cup 2022: వేల్స్‌పై ఇరాన్ థ్రిల్లింగ్ విజయం.. చివర్లో అద్భుతం

25 November 2022, 19:48 IST

  • Iran vs Wales FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు.. బలమైన వేల్స్ జట్టుకు షాకిచ్చింది. చివరి వరకు పోరాడి.. 2-0 తేడాతో విజయం సాధించింది. అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

వేల్స్‌పై ఇరాన్ ఘనవిజయం
వేల్స్‌పై ఇరాన్ ఘనవిజయం (AP)

వేల్స్‌పై ఇరాన్ ఘనవిజయం

Iran vs Wales FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు బోణీ కొట్టింది. చివరి వరకు దోబూచులాడిన విజయం ఆఖరుకు ఇరాన్‌నే వరించింది. వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 2-0 తేడాతో గెలిచింది. నిర్ణీత 90 నిమిషాల్లో ఏ జట్టు గోల్ చేయకపోవడంతో అదనంగా మరో 9 నిమిషాలు ఇచ్చారు. అయితే ఏడో నిమిషం వరకు కూడా ఎలాంటి గోల్ నమోదు కాలేదు. కానీ చివరి రెండు నిమిషాల్లో ఇరాన్ ఆటగాళ్లు అద్భుతమే చేశారు. రెండు గోల్స్ కొట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి గోల్ కీపర్ చేసిన తప్పిదం కారణంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తనకంటే బలమైన వేల్స్ జట్టును ఇరాన్ ఆటగాళ్లు మట్టి కరిపించారు. మొదటి అర్ధభాగంలో గోల్ కొట్టేందుకు మూడు సార్లు ప్రయత్నించిన ఇరాన్.. విఫలయత్నం చేసింది. హోరాహోరీగా సాగిన ఫస్టాఫ్‌లో ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అనంతరం రెండో అర్ధభాగంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిది. గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. ఇలాంటి సమయంలో రిఫరీ 9 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు.

అదనపు సమయం 8వ నిమిషంలో ఇరాన్ ఆటగాడు రూబేజ్ చెష్మీ గోల్ కొట్టి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. అనంతరం వేల్స్ కీపర్ వేన్ హెనెస్సీ అధనపు తప్పిదం చేయడంతో రెడ్ కార్డు ఇచ్చారు. దీంతో ఆ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ సీజన్‌లో రెడ్ కార్డు తీసుకున్న మొదటి ప్లేయర్ అతడే. మొదటి గోల్ కొట్టిన మరో మూడు నిమిషాల్లోనే రమీద్ రెజియిన్ మరో గోల్‌తో అద్భుతమే చేశాడు. ఫలితంగా 2-0 తేడాతో ఇరాన్ విజయం సాధించింది. దీందో రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని సజీవం చేసుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి గేములో 2-6 తేడాతో ఓడిపోయిన ఇరాన్.. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫలితంగా టోర్నీలో తన ఆశలను సజీవం చేసుకుంది. మరోపక్క అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌ డ్రా చేసుకున్న వేల్స్.. ఈ మ్యాచ్‌ ఓటమితో రౌండ్ ఆఫ్ 16 ఆశలను మరింత క్లిష్టతరం చేసుకుంది.