తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bumrah Return To Training: బుమ్రా ఈజ్ బ్యాక్.. ట్రైనింగ్‌లో చెమటలు చిందిస్తున్న పేసర్

Bumrah Return to Training: బుమ్రా ఈజ్ బ్యాక్.. ట్రైనింగ్‌లో చెమటలు చిందిస్తున్న పేసర్

25 November 2022, 18:50 IST

    • Bumrah Return to Training: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా గాయం నుంచి కోలుకుని ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా (AFP)

జస్ప్రీత్ బుమ్రా

Bumrah Return to Training: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌నకు దూరమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా గాయపడిన బుమ్రా.. అనంతరం పొట్టి ప్రపంచకప్‌నకు కూడా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మహమ్మద్ షమీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. తాజాగా బుమ్రా గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి మైదానంలో అడుపెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గాయం నుంచి కోలుకుని మైదానంలో చెమటలు చిందిస్తున్నాడు బుమ్రా. ట్రైనింగ్‌లో పాల్గొన్న తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం అతడి ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా అతడే ట్విటర్ ద్వారా పోస్ట్ చేశాడు.

అంత సులభమేం కాదు.. కానీ ఎల్లప్పుడూ విలువ ఉంటుంది. అంటూ తన ట్రైనింగ్ వీడియోను షేర్ చేశాడు బుమ్రా. ఈ వీడియోను గమనిస్తే బుమ్రా.. మైదానంలో సాధన చేస్తున్నాడు. ఫిట్నెస్‌పై దృష్టి పెట్టి రన్నింగ్‌తో పాటు పలు కసరత్తుల్లో మునిగిపోయాడు.

ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బుమ్రా చివరగా ఆడాడు. ఆ తర్వాత గాయపడటం తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. టీ20 ప్రపంచకప్‌కు మాత్రం మహమ్మద్ షమీని తీసుకున్నారు. బుమ్రా లేకపోవడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బుమ్రా ఈ ఏడాది జులైలో బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్ ఐదో టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది.

టాపిక్

తదుపరి వ్యాసం