తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 For Brazil: ఈసారి వరల్డ్‌కప్‌ బ్రెజిల్‌దే.. తేల్చిన లేటెస్ట్‌ స్టడీ

FIFA world cup 2022 for Brazil: ఈసారి వరల్డ్‌కప్‌ బ్రెజిల్‌దే.. తేల్చిన లేటెస్ట్‌ స్టడీ

Hari Prasad S HT Telugu

25 November 2022, 16:18 IST

    • FIFA world cup 2022 for Brazil: ఈసారి వరల్డ్‌కప్‌ బ్రెజిల్‌దే అని తాజా స్టడీ ఒకటి తేల్చింది. అసలు ఏంటా స్టడీ? బ్రెజిల్‌ గెలుస్తుందని ఎలా చెప్పిందో ఒకసారి చూద్దాం.
బ్రెజిల్ టీమ్
బ్రెజిల్ టీమ్ (FIFA Twitter)

బ్రెజిల్ టీమ్

FIFA world cup 2022 for Brazil: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022పై సెరాసా ఎక్స్‌పీరియన్‌కు చెందిన డాటాల్యాబ్‌ ఓ స్టడీ నిర్వహించింది. ఇందులో ఈసారి బ్రెజిల్‌కే ఎక్కువ విజయావశాకాలు ఉన్నట్లు తేలడం గమనార్హం. ఈ స్టడీ ప్రకారం బ్రెజిల్‌ వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు 20.9 శాతం ఉన్నాయి. ఇక ఆ టీమ్‌ సెమీస్‌ చేరే అవకాశాలను ఈ స్టడీ 53.4 శాతంగా లెక్కగట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

డేటాల్యాబ్‌కు చెందిన డేటా సైంటిస్టులు మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌లను ఉపయోగించి వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌, విజేతలను అంచనా వేసింది. దీని ప్రకారం ఫస్ట్ ప్లేస్‌లో బ్రెజిల్‌ ఉండగా.. తర్వాతి స్థానాల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ ఉన్నాయి.

వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఉన్న టీమ్స్‌

బ్రెజిల్‌ వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు 20.9 శాతం

అర్జెంటీనాకు ఇది 14.3 శాతం

ఫ్రాన్స్‌ అవకాశాలు 11.4 శాతం

స్పెయిన్‌ అవకాశాలు 9 శాతం

జర్మనీ అవకాశాలు 3.4 శాతం

ఈ టీమ్స్‌ నాకౌట్‌ స్టేజ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు

ఈ ఐదు టీమ్స్‌ ఉన్న గ్రూప్స్‌ ప్రకారం ఇవి నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు ఎంత మేర ఉన్నాయన్నదానిపై కూడా ఈ సంస్థ అధ్యయనం చేసింది. దీని ప్రకారం..

బ్రెజిల్‌ నాకౌట్‌కు చేరే అవకాశాలు అత్యధికంగా 97.48 శాతంగా ఉన్నాయి. బ్రెజిల్ గ్రూప్‌ జిలో ఉంది. ఇక గ్రూప్‌ సిలో ఉన్న అర్జెంటీనాకు ఇది 96.1 శాతంగా, గ్రూప్‌ డిలో ఉన్న ప్రాన్స్‌కు ఇది 93.4 శాతంగా, గ్రూప్‌ ఈలో ఉన్న స్పెయిన్‌కు 89.6 శాతంగా, ఇదే గ్రూప్‌లో ఉన్న జర్మనీకి 69.6 శాతంగా లెక్కగట్టారు.

ఈ స్టడీ ఎలా చేశారు?

దీనికోసం ఓ మెషీన్‌ లెర్నింగ్‌ మోడల్‌ను సృష్టించారు. చివరి మూడు వరల్డ్‌కప్‌ సైకిల్స్‌కు చెందిన డేటా ఆధారంగా దీనిని తయారు చేశారు. ఈ డేటా ఆధారంగానే ప్రతి మ్యాచ్‌లో విజేతను కూడా ఈ స్టడీ అంచనా వేయడం గమనార్హం. 2010 వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటి వరకూ ఆయా టీమ్స్‌ ఆడిన అన్ని మ్యాచ్‌లు అంటే ఫ్రెండ్లీ, క్వాలిఫయర్స్‌, రీజినల్‌, వరల్డ్‌కప్స్‌లాంటివన్నీ స్టడీ చేసి ఈసారి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల ఫలితాలను అంచనా వేశారు.