తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya Admits Feeling Sorry For Shami After Defeat Against Delhi

Hardik on Shami: సారీ షమీ.. నీకు నిరాశ కలిగించాం.. దిల్లీ చేతుత్లో ఓటమిపై హార్దిక్ స్పందన

03 May 2023, 13:08 IST

    • Hardik on Shami: దిల్లీ చేతుల్లో ఓడిపోవడంపై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మహమ్మద్ షమీకు క్షమాపణలు చెప్పాడు. అతడికి నిరాశ కలిగించామని అన్నాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్.. దిల్లీ చేతుల్లో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
షమీకి క్షమాపణలు చెప్పిన హార్దిక్
షమీకి క్షమాపణలు చెప్పిన హార్దిక్

షమీకి క్షమాపణలు చెప్పిన హార్దిక్

Hardik on Shami: దిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా.. దిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో 6 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే అంతకుముందు గుజరాత్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి దిల్లీని 130 పరుగులకే కట్టడి చేశారు. మహమ్మద్ షమీ 4 వికెట్లతో విజృంభించాడు. అయినప్పటికీ స్వల్ప లక్ష్యాన్ని చేజ్ చేయకపోవడంతో హార్దిక్ పాండ్య.. షమీకి సారీ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

“పిచ్ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిందని నేను అనుకోవడం లేదు. మేను అనుకున్నదానికంటే నిదానంగా ఉంది. అయితే వాళ్లు బౌలింగ్ బాగా చేశారు. మేము త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయాం. ఫలితంగా కుదురుకోడానికి కాస్త సమయం పట్టింది. మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోయాం. రాహుల్ తిరిగి ట్రాక్‌లోతెచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయాం. వాళ్లు చాలా బాగా ఆడారు.” అని హార్దిక్ పాండ్య అన్నాడు.

"షమీకి నేను సారీ చెబుతున్నాను. అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 129 లేదా 130 పరుగులకు పరిమితం చేయడంలో కీలక పాత్ర చేశాడు. మా బ్యాటర్లు నిరాశ కలిగించారు. బంతి బాగా తిరిగిందని నేను అనుకోవడం లేదు. మహమ్మద్ షమీ ప్రతిభ కారణంగానే తక్కువ స్కోరకు పరిమితం చేశాం. ఇచ్చిన నాలుగు ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ విషయంలో క్రెడిట్ అంతా అతడికే ఇస్తాను. బ్యాటర్లు, ముఖ్యంగా నేను మంచి ఫినిషింగ్ ఇవ్వలేకపోయాను. అతిడికి నిరాశ మిగిల్చాం." అని హార్దిక్ పాండ్య అన్నాడు.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యాన్ని చివరి వరకు పోరాడి కాపాడుకుంది. గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య(56) అర్ధశతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. అతడు మినహా మిగిలిన వారు విఫలం కావడంతో మ్యాచ్ వార్నర్ సేన గెలిచింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా.. అన్రిచ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.