Mohammed Shami : మహ్మద్ షమీకి అక్రమ సంబంధాలున్నాయి.. హసీన్ సంచలన ఆరోపణలు-mohammed shamis wife hasin jahan goes to supreme court for arrest warrant against him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mohammed Shami's Wife Hasin Jahan Goes To Supreme Court For Arrest Warrant Against Him

Mohammed Shami : మహ్మద్ షమీకి అక్రమ సంబంధాలున్నాయి.. హసీన్ సంచలన ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
May 03, 2023 11:42 AM IST

Mohammed Shami-Hasin Jahan : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై అతడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ వేశ్యలతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.

మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ (twitter)

ఐపీఎల్‌ 2023లో అదరగొడుతున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami) వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. షమీ అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాలంటూ అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్‌ జహాన్‌(Hasin Jahan) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.

షమీ ఇప్పటికీ వేశ్యలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని హసీన్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. షమీ కట్నం అడిగేవాడని తెలిపారు. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలన్న హాసీన్ పిటిషన్ ను కోల్ కతా హైకోర్టు కొట్టివేయగా.., దాన్ని సవాల్ చేస్తూ.. ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లారు.

'షమీ దగ్గర వ్యక్తిగత అవసరాల కోసం. సెకండ్ మెుబైల్ ఫోన్ ఉండేది. దీనిని ఉపయోగించి.. అతడు తన వివాహేతర సంబంధాలను కొనసాగించేవాడు. పడుపు వృత్తి చేసుకుని బతికే వాళ్లతో టచ్ లో ఉండేవాడు. ఈ ఫోన్ ను కోల్ కతాలోని లాల్ బజార్ పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. షమీ ఇప్పుడు కూడా తన లైంగిక అవసరాల కోసం.. యథేచ్ఛగా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.' అని హసీన్ పిటిషన్లో పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు కూడా షమీ అక్కడి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడని హసీన్ ఆరోపణలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాంటి వ్యక్తి నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడని వెంటనే అరెస్టు చేసేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరినట్టుగా తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లోని సెషన్స్ కోర్టు షమీ(Shami)పై జారీ చేసిన అరెస్టు వారెంట్ పై స్టే విధించిన విషయం తెలిసిందే. 2018లో షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని జహాన్ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఈ కారణంగా అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. షమీ.. హసీన్ కు నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని ఈ ఏడాది 2023 జనవరిలో కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. అందులో రూ.50 వేలు హసీన్ ఖర్చులకు, మరో 80 వేలు ఆమెతో కలిసి ఉంటున్న కుమార్తె పోషణకు అని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ విషయంపై హసీన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. నెలకు రూ.10 లక్షల భరణం కోరింది. రూ.7లక్షలు ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం, రూ.3 లక్షలు కుమార్తె పోషణ కోసమని హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్