Supreme Court: జడ్జికి పనిష్మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. జ్యుడిషియల్ అకాడమీకి పంపాలని ఆదేశం-supreme court directs to send sessions judge for training to improve skills ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: జడ్జికి పనిష్మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. జ్యుడిషియల్ అకాడమీకి పంపాలని ఆదేశం

Supreme Court: జడ్జికి పనిష్మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. జ్యుడిషియల్ అకాడమీకి పంపాలని ఆదేశం

Chatakonda Krishna Prakash HT Telugu
May 03, 2023 11:21 AM IST

Supreme Court: ఓ సెషన్స్ జడ్జికి సుప్రీం కోర్టు పనిష్మెంట్ విధించింది. న్యాయవిచారణ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఆయనను జ్యుడిషియల్ అకాడమీకి పంపాలని ఆదేశించింది.

Supreme Court: జడ్జికి పనిష్మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు
Supreme Court: జడ్జికి పనిష్మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు

Supreme Court: ఓ సెషన్స్ జడ్జి నుంచి జ్యుడిషియల్ బాధ్యతలను వెనక్కి తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయ విచారణ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఆ జడ్జిని జ్యుడిషియల్ అకాడమీకి పంపాలని సూచించింది. సాధారణ కేసుల్లోనూ ఆ జడ్జి.. బెయిల్ మంజూరు చేస్తుండకపోవటంతో అలాహాబాద్ హైకోర్టుకు సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court: ఏ జడ్జి అయినా సులభంగా మంజూరు చేయాల్సిన కేసుల్లోనూ బెయిల్ ఇవ్వకుండా జాప్యం చేస్తే జ్యుడిషియల్ బాధ్యతల నుంచి తప్పిస్తామని మార్చి 21వ తేదీనే సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఇలాంటివి పునరావృతం చేయవద్దని సూచించింది. అయితే, ఆ ఆదేశాలను లక్నోలోని ఈ సెషన్స్ జడ్జి పాటించలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

Supreme Court: అమికస్ క్యూరీగా వచ్చిన అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా.. ఆ జడ్జి బెయిల్ ఆర్డర్లు ఇవ్వని కేసులను సుప్రీం ధర్మాసనం ముందు ఉంచారు. అందులో ఒకటి వివాహానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నిందితుడు, అతడి తల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు లక్నోసెషన్స్ జడ్జి నిరాకరించారని తెలిపారు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలైనా.. ఆ ఇద్దరు అరెస్టు కాలేదని, అయినా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఆ జడ్జి అంగీకరించలేదని తెలిపారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న నిందితుడికి ఘజియాబాద్‍లోని సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వలేదని రెండో కేసును అమికస్ క్యూరీ ఉటంకించారు.

Supreme Court: ఈ కేసుల పట్ల సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అనుసరించకుండా ఇస్తున్న ఇలాంటి తీర్పుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ప్రకారం కోర్టులు నిర్ణయాలు తీసుకొని తీర్పులు ఇవ్వాలని, దీన్ని అనుసరించడం చాలా ముఖ్యమని ధర్మాసనం తెలిపింది.

Supreme Court: ఉత్తర ప్రదేశ్‍లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోందని, తాము మార్చి 21న ఆదేశాలు ఇచ్చాక కూడా దాన్ని లక్నో కోర్టు అతిక్రమించిందని పేర్కొంది. జడ్జిల న్యాయ విచారణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అలహాబాద్ హైకోర్టు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలను అనవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

IPL_Entry_Point