Live news today : గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ-live news today 25th april national and international topics latest updates in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today : గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

నేటి జాతీయ, అంతర్జాతీయ వార్తలు(ANI)

Live news today : గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

12:20 AM ISTApr 25, 2023 05:51 PM HT Telugu Desk
  • Share on Facebook
12:20 AM IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ వార్తలు తెలుసుకునేందుకు ఈ లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Tue, 25 Apr 202301:37 PM IST

Rahul Gandhi: గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: పరువు నష్టం కేసులో కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారించిన మెజిస్ట్రేట్ తీర్పును నిలిపివేయాలన్న అభ్యర్థనను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు.  “మోదీ ఇంటిపేరు”పై 2019లో చేసిన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీ దోషిగా ప్రకటించి, రెండేళ్ల జైలు శిక్ష వేసింది సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు. ఈ కేసులో దోష నిర్ధారణను నిలిపివేయాలని సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఈనెలలో ఆశ్రయించారు. అయితే, ఆ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఇప్పుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. 

Tue, 25 Apr 202312:21 PM IST

రెజర్ల ఆందోళనకు మాజీ సీఎం మద్దతు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న భారత స్టార్ రెజర్లకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న రెజర్లను కలిసి సంఘీభావం ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని రెజర్లు ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు.  వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tue, 25 Apr 202311:29 AM IST

మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

US President Joe Biden: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ పదవి కోసం తాను రెండోసారి బరిలో నిలుస్తానని 80 ఏళ్ల బైడెన్ అధికారికంగా ప్రకటించారు. వయసురీత్యా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ రేగగా.. పోటీలో ఉండేందుకే బైడెన్ మొగ్గుచూపారు.

Tue, 25 Apr 202310:38 AM IST

ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి బయలుదేరిన భారతీయులు

Sudan - Operation Kaveri: ఘర్షణలతో కల్లోలంగా మారిన సూడాన్ నుంచి భారతీయుల తొలి గ్రూప్ స్వదేశానికి బయలుదేరింది. సూడాన్‍లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరిని చేపట్టింది. ఇందులో భాగంగా తొలి గ్రూప్ సూడాన్ నుంచి మంగళవారం పయనమైంది. 

Tue, 25 Apr 202310:02 AM IST

వన్‍ప్లస్ ప్యాడ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన సంస్థ 

వన్‍ప్లస్ ప్యాడ్ ధరను అధికారికంగా ప్రకటించింది వన్‍ప్లస్. ఈ ట్యాబ్ ప్రారంభ ధర రూ.37,999గా ఉంది. 11.61 ఇంచుల డిస్‍ప్లే, నాలుగు స్పీకర్లు, మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఈ ట్యాబ్ కలిగి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tue, 25 Apr 202309:27 AM IST

డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

కేరళలోని తిరువనంతరపురంలో డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అలాగే, రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా మంళవారం అంకురార్పన చేశారు. అంతకు ముందు వాటర్ మెట్రో, 16వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‍ను మోదీ ప్రారంభించారు. 

Tue, 25 Apr 202308:43 AM IST

ఒకేసారి 180 వెబ్‍సైట్లను ప్రారంభించిన ఢిల్లీ సీఎం

సామాన్య ప్రజలకు ఆన్‍లైన్ ద్వారా సేవలు అందించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 180 కొత్త వెబ్‍సైట్లను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ప్రారంభించారు. ప్రజలకు 50కు పైగా ప్రభుత్వ శాఖల సర్వీసులను మరింత చేరువ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ వెబ్‍సైట్లను రూపొందించింది. 

Tue, 25 Apr 202308:02 AM IST

ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్

ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో మంగళవారం లాంచ్ అయింది. సూపర్ అమోలెడ్ ఆర్క్‌డ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ను ఈ కలిగి ఉంది. ఈనెల 27న ఫ్లిప్‍కార్ట్ లో సేల్‍కు వస్తుంది. ఈ వాచ్ ధర రూ.3,995గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tue, 25 Apr 202307:50 AM IST

రేపే ఎంజీ కామెట్​ లాంచ్​..

ఆటోమొబైల్​ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంజీ కామెట్​ ఈవీ.. బుధవారం ఇండియాలో లాంచ్​కానుంది. ఈ విషయాన్ని ఎంజీ మోటార్​ అధికారికంగా ప్రకటించింది.

Tue, 25 Apr 202307:26 AM IST

ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే..: అమిత్ షా

కర్ణాటకలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్‍కోట్‍లో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీని మళ్లీ గెలిపించాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అవినీతి, కుటుంబ రాజకీయాలు, అల్లర్లు అధికమవుతాయని అన్నారు. 

Tue, 25 Apr 202307:09 AM IST

వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ..!

దేశంలోనే తొలి వాటర్​ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన కొచ్చిలో ఈ వాటర్​ మెట్రోను మంగళవారం లాంచ్​ చేశారు. అంతకుముందు.. కేరళలో తొలి వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను సైతం ప్రారంభించారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 25 Apr 202306:38 AM IST

యూపీ సీఎం ఆదిత్యనాథ్‍కు బెదిరింపు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ను చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశాడు. ఈ విషయంపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tue, 25 Apr 202306:25 AM IST

స్టాక్​ మార్కెట్​లు..

స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 112 పాయింట్ల లాభంతో 60,168 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 17,781 వద్ద ట్రేడ్​ అవుతోంది. బజాజ్​ ఫినాన్స్​ టాప్​ గెయినర్​గా ఉంది.

Tue, 25 Apr 202305:49 AM IST

వందే భారత్​..

దేశంలో మరో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రధాని మోదీ ప్రారంభించారు.  కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. తిరువనంతపురం రైల్వే స్టేషన్​లో.. తిరువనంతపురం సెంట్రల్​- కసర్​గోడ్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను లాంచ్​ చేశారు.

Tue, 25 Apr 202305:38 AM IST

తిరువనంతపురం రైల్వే స్టేషన్‍కు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‍కు చేరుకున్నారు. కాసేపట్లో తిరువనంతపురం - కసర్‌గడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. కేరళలో నడిచే తొలి వందే భారత్ రైలు ఇదే. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

Tue, 25 Apr 202305:31 AM IST

ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

రెజ్లర్ల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫెడరేషన్​ చీఫ్​ బ్రిజ్​భూషణ్​ శరణ్​ సింగ్​పై కేసు నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్​పై స్పందించాలని కోర్టు ఆదేశించింది.

Tue, 25 Apr 202304:36 AM IST

బజాజ్ ఆటో రిజల్ట్స్ నేడే

2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ నేడు (ఏప్రిల్ 25) వెల్లడించనుంది. ఆటో పరిశ్రమకు ఈ రిజల్ట్స్ కీలకంగా ఉండనున్నాయి. అలాగే ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా ఫలితాలు కూడా నేడే రానున్నాయి.

Tue, 25 Apr 202304:16 AM IST

సూడాన్​లో కాల్పుల విరమణ

సుడాన్​లో పరిస్థితులు శాంతిస్తున్నాయి! 72 గంటల పాటు కాల్పుల విరమణకు సైన్యం, ఆర్​ఎస్​ఎఫ్​ దళాల అధిపతులు అంగీకరించారు. మరోవైపు వివిధ దేశాలు, సుడాన్​లో తన దేశస్తులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్​లను చేపట్టాయి.

Tue, 25 Apr 202303:56 AM IST

ఫ్లాట్​గా దేశీయ స్టాక్​ మార్కెట్​లు..

ఇండియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 37 పాయింట్ల లాభంతో 60,094 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 7 పాయింట్లు పెరిగి 17,751 వద్ద ట్రేడ్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 25 Apr 202303:52 AM IST

కేరళ వాటర్​ మెట్రో..

ఈ వాటర్​ మెట్రో ప్రాజెక్ట్​ను రూ. 1,137 కోట్ల ఖర్చుతో రూపొందించింది కేరళ ప్రభుత్వం. వాటర్​ మెట్రోలో ఛార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. కనిష్ఠ టికెట్​ ధర రూ. 20గా ఉండగా.. గరిష్ఠంగా రూ. 40గా ఉండటం విశేషం.

Tue, 25 Apr 202303:49 AM IST

తొలి వాటర్​ మెట్రో ప్రారంభం నేడే

కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిలో నేడు వాటర్​ మెట్రోను ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్​ మెట్రోగా చరిత్రలో నిలిచిపోనుంది. అధికారుల ప్రకారం.. ఈ వాటర్​ మెట్రో.. కొచ్చికి సమీపంలోని దాదాపు 10 ద్వీపాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్​లో టూరింజం మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.