Wrestlers Protest: “తీవ్రమైన ఆరోపణలు”: రెజర్ల ఆందోళనల విషయంలో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు-supreme court issues notice to delhi police on wrestlers plea seeking fit against wfi chief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Supreme Court Issues Notice To Delhi Police On Wrestlers Plea Seeking Fit Against Wfi Chief

Wrestlers Protest: “తీవ్రమైన ఆరోపణలు”: రెజర్ల ఆందోళనల విషయంలో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2023 11:59 AM IST

Wrestlers Protest: రెజర్లు దాఖలు చేసిన పిటిషన్‍పై ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‍పై కేసు నమోదు విషయంలో స్పందన తెలపాలని సూచించింది.

ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతున్న రెజర్లు
ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతున్న రెజర్లు (HT_PRINT)

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‍పై కేసు నమోదు చేయాలని కోరుతూ భారత టాప్ రెజర్లు దాఖలు చేసిన పిటిషన్‍పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రిజ్ భూషణ్‍పై కేసు నమోదు విషయంలో స్పందన తెలుపాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు వారి పిటిషన్‍పై స్పందించింది. వివరాలివే..

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‍పై ఎఫ్‍ఐఆర్ విషయంలో స్పందన తెలపాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. రెజర్లు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని బెంచ్ పేర్కొంది. శుక్రవారం రోజున మళ్లీ ఈ విషయంపై కోర్టు విచారణ జరపనుంది. లైగింక వేధింపుల ఆరోపణలు ఉన్నా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ అడ్వకొట్ కపిల్ సిబల్ కోర్టుకు సమర్పించిన ఫైలింగ్‍లో తెలిపారు. “నోటీసు జారీ చేస్తున్నాం. విచారణ కోసం శుక్రవారానికి లిస్ట్ చేయండి” అని బెంచ్ పేర్కొంది.

Wrestlers Protest: లైగింక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్‍పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఏడుగురు మహిళా రెజర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Wrestlers Protest: కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్, 2016 ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా సహా మరికొందరు రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసనకు దిగారు. అక్కడే ఉంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Wrestlers Protest: ఈ ఏడాది జనవరిలోనూ రెజర్లు ఢిల్లీలో ఆందోళనకు నిర్వహించారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై ఓ ప్యానెల్‍ను అప్పడు ప్రభుత్వం నియమించింది. ఆ ప్యానెల్ నివేదిక సమర్పించింది. అయితే, ఇంత వరకు ఆ నివేదిక వెల్లడి కాలేదు. బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోలేదు. దీంతో రెజర్లు మరోసారి ఆందోళనకు దిగారు.

ఆందోళనలో కూర్చున్న సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ ఓ దశలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన విరమించబోమని రెజర్లు చెబుతున్నారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం