OnePlus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్: సేల్ డేట్, ఆఫర్ల వివరాలు-oneplus pad price in india revealed officially by oneplus know sale date offers specifications and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్: సేల్ డేట్, ఆఫర్ల వివరాలు

OnePlus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్: సేల్ డేట్, ఆఫర్ల వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2023 03:30 PM IST

OnePlus Pad Price in India: వన్‍ప్లస్ ప్యాడ్ ధరను వన్‍ప్లస్ అధికారికంగా వెల్లడించింది. ఈ ట్యాబ్ సేల్ తేదీ, ఆఫర్ల వివరాలను ప్రకటించింది.

OnePlus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్ (Photo: OnePlus)
OnePlus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్ (Photo: OnePlus)

OnePlus Pad Price in India: వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్ అధికారిక ధర వివరాలు వచ్చేశాయి. ఇండియాలో తన తొలి ట్యాబ్ అయిన ఈ 'ప్యాడ్' ధర, ఆర్డర్లు, ఆఫర్ల వివరాలను వన్‍ప్లస్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరిలో ఈ ట్యాబ్‍ను భారత్‍లో వన్‍ప్లస్ లాంచ్ చేయగా.. ఇప్పుడు ధర, సేల్ వివరాలను వెల్లడించింది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్, 2.8K రెజల్యూషన్ డిస్‍ప్లే, నాలుగు స్పీకర్లతో ఈ ట్యాబ్ వస్తోంది. వన్‍ప్లస్ ప్యాడ్ పూర్తి వివరాలివే.

వన్‍ప్లస్ ప్యాడ్ ధర, సేల్

OnePlus Pad Price in India: వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్ ఇండియాలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ప్రారంభ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధరను రూ.39,999గా వన్‍ప్లస్ నిర్ణయించింది. ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వన్‍ప్లస్ అధికారిక వెబ్‍సైట్, ఈ-కామర్స్ సైట్ల్ ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍ సహా ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్ బుకింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. హోలో గ్రీన్ కలర్ ఆప్షన్‍లో లభిస్తుంది.

OnePlus Pad Offers: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో వన్‍ప్లస్ ప్యాడ్‍ను కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ప్రముఖ బ్యాంకుల కార్డులపై 12 నెలల వరకు ఉచిత ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.

వన్‍ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లు

OnePlus Pad: 2800x2000 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 11.61 ఇంచుల ఎల్‍సీడీ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్ వచ్చింది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‍ప్లేకు హైలైట్ కాగా.. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెెస్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది.

నాలుగు స్పీకర్లు

OnePlus Pad: మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై వన్‍ప్లస్ ప్యాడ్ రన్ అవుతుంది. ఈ ట్యాబ్‍కు నాలుగు స్పీకర్లు ఉంటాయి. డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ ఉంటుంది. ట్యాబ్ ఓరియంటేషన్‍ను బట్టి సౌండ్ ఆప్టిమైజ్ అయ్యే ఓమ్నీ బేరింగ్ సౌండ్ ఎఫెక్ట్ ప్రత్యేకతగా ఉంది.

కెమెరాలు, బ్యాటరీ

OnePlus Pad: వన్‍ప్లస్ ప్యాడ్ వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ట్యాబ్ వచ్చింది. 9,150mAh బ్యాటరీ ఈ వన్‍ప్లస్ ప్యాడ్‍లో ఉంటుంది. 67వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్ మొత్తంగా 552 గ్రాముల బరువు ఉంటుంది.

Whats_app_banner