Fastrack Revoltt FS1 Pro: విభిన్నమైన డిస్‍ప్లేతో ఫాస్ట్రాక్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్: వివరాలివే
Fastrack Revoltt FS1 Pro Smartwatch: ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఆర్క్‌డ్ డిస్‍ప్లేతో వచ్చింది. ఈ వాచ్ పూర్తి వివరాలివే.

Fastrack Revoltt FS1 Pro Smartwatch: రివోల్ట్ సిరీస్‍లో ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్రాక్ (Fastrack) మరో స్మార్ట్‌వాచ్‍ను తీసుకొచ్చింది. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో (Fastrack Revoltt FS1 Pro) వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ సూపర్ అమోలెడ్ ఆర్క్‌డ్ డిస్‍ప్లేతో ఈ వాచ్ వచ్చింది. ఈ డిస్‍ప్లే కాస్త వంపు (ఆర్క్‌డ్) తిరిగి ఉంటుంది. డిస్‍ప్లే మధ్య భాగంలో ఈ ఆర్క్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో వాచ్ వచ్చింది. ఈ వాచ్ పూర్తి ఫీచర్లు, ధర, సేల్ వివరాలు ఇవే.
ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Fastrack Revoltt FS1 Pro: 1.96 ఇంచుల సూపర్ అమోలెడ్ ఆర్క్‌డ్ డిస్‍ప్లేను ఈ ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో వాచ్ కలిగి ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్ ఉంటుంది. 200కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఈ వాచ్ వచ్చింది.
Fastrack Revoltt FS1 Pro: సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్, స్పీకర్ ఉన్నాయి. మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు.
హార్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఒత్తిడిని విశ్లేషించే స్ట్రెస్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ వచ్చింది. 110కి పైగా స్పోర్ట్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
Fastrack Revoltt FS1 Pro: ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 10 నిమిషాల చార్జ్‌తో ఒక రోజు వినియోగించుకునేలా నోట్రోఫాస్ట్ చార్జింగ్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‍లో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్‍నకు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లోనే నోటిఫికేషన్లు పొందవచ్చు. వాయిస్ అసిస్టెంట్‍కు Fastrack Revoltt FS1 Pro వాచ్ సపోర్ట్ చేస్తుంది.
ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ ధర, సేల్
Fastrack Revoltt FS1 Pro: ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ ధర రూ.3,995గా ఉంది. ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), ఫాస్ట్రాక్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. బ్లాక్, బ్ల, టీల్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తుంది.