తెలుగు న్యూస్  /  Sports  /  India Vs Western Australia To Play Second Match As Kohli And Team To Face One Of The Fastest Bowler

India vs Western Australia: విరాట్‌ కోహ్లిపై ఫాస్టెస్ట్‌ బౌలర్‌ను ప్రయోగించనున్న వెస్టర్న్‌ ఆస్ట్రేలియా!

Hari Prasad S HT Telugu

12 October 2022, 22:10 IST

    • India vs Western Australia: విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియాలోని ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకరిని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది వెస్టర్న్‌ ఆస్ట్రేలియా టీమ్‌. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు గురువారం (అక్టోబర్‌ 13) టీమిండియా మరో ప్రాక్టీస్‌ మ్యాచ్ ఆడబోతోంది.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

విరాట్ కోహ్లి

India vs Western Australia: ఆసియాకప్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టనున్నాడు. వెస్టర్న్‌ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్‌.. గురువారం (అక్టోబర్‌ 13) రెండో మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. అతనితోపాటు తొలి మ్యాచ్‌కు అశ్విన్‌, రాహుల్‌ కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియాలోని ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడైన లాన్స్‌ మోరిస్‌తో విరాట్ కోహ్లికి వెల్‌కమ్‌ చెప్పడానికి వెస్టర్న్‌ ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. మోరిస్‌ కూడా తొలి మ్యాచ్‌ ఆడలేదు. ఇప్పుడతన్ని రెండో మ్యాచ్‌లో బరిలోకి దింపనున్నారు. అతనితోపాటు ఆస్ట్రేలియా నేషనల్‌ టీమ్‌లో ఆడే జై రిచర్డ్‌సన్‌, ఆండ్రూ టై, జేసన్‌ బెహ్రెండార్ఫ్‌లు కూడా వెస్టర్న్‌ ఆస్ట్రేలియా టీమ్‌లో ఉన్నారు.

దీంతో ఈ మ్యాచ్‌ కోహ్లితోపాటు ఇండియన్ టీమ్‌ బ్యాటర్లందరికీ ఓ సవాలు కానుంది. ఆస్ట్రేలియాలో ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడిగా లాన్స్‌ మోరిస్‌కు పేరుంది. 24 ఏళ్ల మోరిస్‌.. ఈ మధ్యే షెఫీల్డ్‌ షీల్డ్‌ మ్యాచ్‌లో న్యూ సౌత్‌ వేల్స్‌పై 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ రైట్‌ ఆర్మ్‌ సీమ్‌ బౌలర్‌.. తన వేగంతో ప్రత్యర్థులను బెదరగొడుతున్నాడు. ఇక మోరిస్‌తోపాటు మరో వికెట్‌కీపర్ బ్యాటర్‌ జోష్‌ ఫిలిప్‌ కూడా వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌లోకి వచ్చారు.

ఈ ఇద్దరూ రిచర్డ్‌సన్‌, ఆరోన్‌ హార్డీల స్థానాలను భర్తీ చేయనున్నారు. పెర్త్‌లోని వాకా స్టేడియంలో తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న ఇండియన్‌ టీమ్‌.. ఈ మ్యాచ్‌ కూడా గెలిచి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో జరగబోయే వామప్‌ మ్యాచ్‌లకు కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 52 రన్స్ చేయడంతో ఇండియన్‌ టీమ్‌ 13 రన్స్‌తో గెలిచిన విషయం తెలిసిందే.

అటు హార్దిక్‌ పాండ్యా కూడా 20 బాల్స్‌లో 26 రన్స్‌ చేశాడు. ఇక బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3 వికెట్లతో రాణించాడు. భువనేశ్వర్‌ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. గురువారం పెర్త్‌లో ఈ మ్యాచ్ ఆడిన తర్వాత ఇండియన్ టీమ్‌ బ్రిస్బేన్‌ వెళ్లనుంది. అక్కడ అక్టోబర్‌ 17, 19వ తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో అధికారిక వామప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడుతుంది.