T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్స్‌ ఏవో తెలుసా?-here is t20 world cup winners from 2007 to 2021 in images ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Is T20 World Cup Winners From 2007 To 2021 In Images

T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్స్‌ ఏవో తెలుసా?

Oct 12, 2022, 04:35 PM IST Hari Prasad S
Oct 12, 2022, 04:35 PM , IST

  • T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్‌ 2022కు టైమ్‌ దగ్గర పడింది. ఈ ఫార్మాట్‌లో జరగబోతున్న 8వ వరల్డ్‌కప్‌ ఇది. ఇప్పటి వరకూ 7సార్లు ఈ మెగా టోర్నీ జరగగా.. ఆరు టీమ్స్‌ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. వెస్టిండీస్‌ ఒక్కటే రెండుసార్లు టీ20ల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2007 నుంచి 2021 వరకూ జరిగిన వరల్డ్‌కప్‌లలో ఏయే టీమ్స్‌ విజేతలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం.

T20 World Cup Winners: 2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ సేన.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకూ మరోసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది.

(1 / 7)

T20 World Cup Winners: 2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ సేన.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకూ మరోసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది.(Twitter)

T20 World Cup Winners: ఇక 2007లో మిస్‌ అయిన టీ20 వరల్డ్‌కప్‌ను 2009లో అందుకుంది పాకిస్థాన్‌. ఆ టీమ్‌ ఫైనల్లో శ్రీలంకను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

(2 / 7)

T20 World Cup Winners: 2010లో తొలిసారి క్రికెట్‌ పుట్టింటికి ఓ వరల్డ్‌కప్‌ చేరింది. అప్పటి వరకూ వన్డేల్లో విశ్వవిజేతగా నిలవని ఇంగ్లండ్‌ టీమ్‌.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆ టీమ్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేయడం విశేషం.

(3 / 7)

T20 World Cup Winners: వన్డే క్రికెట్‌లో తొలి రెండు వరల్డ్‌కప్‌లను గెలిచి క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్‌ గడ్డపైకి మరో వరల్డ్‌కప్‌ 2012లో వెళ్లింది. ఈసారి టీ20ల్లో ఆ టీమ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను మట్టి కరిపించి తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది.

(4 / 7)

T20 World Cup Winners: 1996లో రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక టీమ్‌ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. ఇక 2014లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను కూడా లంక సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇండియాను ఓడించి మరీ ఆ దేశం విశ్వవిజేతగా నిలవడం విశేషం.

(5 / 7)

T20 World Cup Winners: 2012లో తాము గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌ గాలివాటం కాదని నిరూపించింది వెస్టిండీస్‌. 2016లోనూ మరోసారి టీ20ల్లో ఛాంపియన్‌గా నిలిచి క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ ఫైనల్లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. చివరి నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాది విండీస్‌కు ఎవరూ ఊహించని విజయాన్ని, ప్రపంచకప్‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చాడు కార్లోస్‌ బ్రేత్‌వెయిట్‌.

(6 / 7)

T20 World Cup Winners: వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా తన తొలి టీ20 వరల్డ్‌కప్‌ కలను 2021లో సాకారం చేసుకుంది. 2010లో ఇంగ్లండ్‌ చేతుల్లో ఓడి ట్రోఫీ మిస్సయిన ఆ టీమ్‌.. 2021లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీ అందుకుంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు