తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Pakistan Fans Dance: కలిసి డ్యాన్స్‌ చేసిన ఇండియా, పాకిస్థాన్‌ అభిమానులు.. వీడియో వైరల్‌

India Pakistan Fans Dance: కలిసి డ్యాన్స్‌ చేసిన ఇండియా, పాకిస్థాన్‌ అభిమానులు.. వీడియో వైరల్‌

Hari Prasad S HT Telugu

26 October 2022, 15:23 IST

    • India Pakistan Fans Dance: ఇండియా, పాకిస్థాన్‌ అభిమానులు కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో మ్యాచ్‌కు ముందు అందరూ కలిసి స్టెప్పులేశారు.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన 94 వేల మంది
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన 94 వేల మంది (AFP)

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన 94 వేల మంది

India Pakistan Fans Dance: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎలా సాగిందో మనమందరం చూశాం. చివరి బాల్‌ వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరికి విరాట్‌ కోహ్లి మెరుపులతో ఇండియా 4 వికెట్లతో విజయం సాధించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో సుమారు 94 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్‌ జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మ్యాచ్‌ సందర్భంగా ఇండియా, పాకిస్థాన్‌ అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. వాళ్ల అరుపులు మెల్‌బోర్న్‌లో కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించాయంటే మ్యాచ్‌ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే స్టేడియంలోనే కాదు.. మ్యాచ్‌కు ముందు ఇండియా, పాకిస్థాన్ అభిమానులు స్టేడియం బయట కూడా హడావిడి చేశారు.

రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని పక్కనపెట్టి అభిమానులంతా కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పాపులర్ పంజాబీ సింగర్‌ సుఖ్‌బీర్‌ సాంగ్‌ అయిన ఇష్క్‌ తేరా తడ్‌పావేపై అందరూ కలిసి స్టెప్పులేశారు. తమ దేశాల జెండాలను పట్టుకొని ఈ ఎవర్‌గ్రీన్‌ పాటపై తమను తాము మైమరచిపోయి డ్యాన్స్‌ చేయడం విశేషం.

ఈ వీడియోను బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా రీట్వీట్ చేశాడు. ఎంసీజీ దగ్గర ఐకమత్యం అంటూ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడీ వీడియోకు 2 లక్షలకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. చివరికి క్రికెటే విజయం సాధించింది అంటూ ఈ వీడియోపై ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ఇక మరో యూజర్‌ కామెంట్ చేస్తూ ఈ పాటకు ఉన్న పాపులారిటీ గురించి చెప్పాడు.

ఇక మ్యాచ్‌ రోజే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా అభిమానుల డ్యాన్స్‌కు సంబంధించి మరో వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో ఇండియన్‌ ఫ్యాన్స్‌ అంతా మరో పాపులర్‌ హిందీ సాంగ్‌ లుంగీ డ్యాన్స్‌పై స్టెప్పులేశారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్లతో ఓడించిన ఇండియా టీ20 వరల్డ్‌కప్‌లో అదిరిపోయే ఆరంభం అందుకుంది.