తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Afg In Asia Cup As Both Teams Looking For Some Pride In Their Final Match

Ind vs Afg in Asia Cup: ఫైనల్‌ బెర్త్‌ పోయింది.. ఇండియా పరువైనా నిలుస్తుందా?

Hari Prasad S HT Telugu

08 September 2022, 12:05 IST

    • Ind vs Afg in Asia Cup: ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్త్‌ ఎలాగూ పోయింది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై గెలిచి ఇండియన్‌ టీమ్‌ కనీసం పరువైనా నిలుపుకుంటుందా లేదా చూడాలి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (AP)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Ind vs Afg in Asia Cup: ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆదివారం జరగబోయే ఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్‌ తలపడబోతున్నాయి. అయితే ఆలోపు పెద్దగా ప్రాధాన్యత లేని మరో రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అందులో ఒకటి గురువారం (సెప్టెంబర్‌ 8) జరగబోయే ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌ ఒకటి కాగా.. మరొకటి శుక్రవారం (సెప్టెంబర్‌ 9) జరగబోయే శ్రీలంక, పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఇది ఫైనల్‌కు రిహార్సల్స్‌లా ఉండబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే గురువారం ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్సే పరువు కోసం ఆడనున్నాయి. ఈ రెండు టీమ్స్‌ సూపర్‌ ఫోర్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయాయి. దీంతో చివరి మ్యాచ్‌లో విజయంతో ముగించాలని చూస్తున్నాయి. లీగ్‌ స్టేజ్‌లో ఆయా గ్రూప్‌లలో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్‌ ఫోర్‌లో అడుగుపెట్టిన ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లకు ఈ స్టేజ్‌లో చేదు పరాభవాలు ఎదురయ్యాయి.

ఈ రెండు టీమ్స్‌ శ్రీలంక, పాకిస్థాన్‌ల చేతుల్లో ఓడిపోయాయి. ఇక చివరి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా కొత్తగా పోయేదేమీ లేదు. ఒక్క పరువు తప్ప. దీంతో ఆ పరువు కోసం టీమిండియా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగుతోంది. తుది జట్టులో ఏవేవో ప్రయోగాలు చేస్తూ, బ్యాటింగ్‌ ఆర్డర్లు మారుస్తూ చేజేతులా మ్యాచ్‌లు ఓడిన ఇండియా.. చివరి మ్యాచ్‌లోనూ ఈ ప్రయోగాలను కొనసాగిస్తుందా లేదా చూడాలి.

అటు ఆఫ్ఘనిస్థాన్‌పై ఇప్పటి వరకూ ఆడిన మూడు టీ20ల్లోనూ ఇండియానే గెలిచింది. అయితే ఇప్పటి ఆఫ్ఘన్ టీమ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. లీగ్‌ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లలోనూ గెలవడంతోపాటు సూపర్‌ ఫోర్‌లోనూ శ్రీలంక, పాకిస్థాన్‌ టీమ్స్‌పై గట్టిగానే పోరాడింది. పాక్‌పై దాదాపు గెలిచినంత పని చేసింది. దీంతో ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌ కూడా ఇండియాకు సవాలే కానుంది.

ఇండియా తుది జట్టు (అంచనా): రోహిత్, విరాట్‌, సూర్యకుమార్‌, పంత్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, చహల్‌, అర్ష్‌దీప్‌

ఆఫ్ఘనిస్థాన్‌ తుది జట్టు (అంచనా): హజ్రతుల్లా, గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, మహ్మద్‌ నబీ, నజీబుల్లా జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, షిన్వారీ, రషీద్‌ ఖాన్‌, నవీనుల్‌ హక్‌, ముజీబుర్‌, ఫజల్‌హక్‌ ఫరూకీ