తెలుగు న్యూస్  /  Sports  /  Icc Player Of The Month Shubman Gill For His Performance In January

ICC Player of the Month Shubman Gill: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ శుభ్‌మన్ గిల్

Hari Prasad S HT Telugu

13 February 2023, 17:10 IST

    • ICC Player of the Month Shubman Gill: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా నిలిచాడు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్. జనవరి నెలకుగాను అతనికీ అవార్డు దక్కడం విశేషం.
శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ (PTI)

శుభ్‌మన్ గిల్

ICC Player of the Month Shubman Gill: ఇండియన్ టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్. గతేడాది కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా గత జనవరి నెలలో గిల్ వన్డేలు, టీ20లలో చెలరేగిపోయాడు. దీంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అతన్ని వరించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

శ్రీలంక, న్యూజిలాండ్ లపై గిల్ ప్రదర్శన ఇండియన్ టీమ్ కు సిరీస్ లు సాధించి పెట్టింది. న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా హైదరబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో గిల్ డబుల్ సెంచరీ కూడా చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా కూడా నిలిచాడు. మొత్తంగా మూడు సెంచరీలతోపాటు జనవరి నెలలో శుభ్‌మన్ గిల్ 567 రన్స్ చేయడం విశేషం.

ఆ తర్వాత న్యూజిలాండ్ తో చివరి వన్డేలోనూ మరో సెంచరీ చేశాడు. అంతకుముందు శ్రీలంకతో సిరీస్ లోనూ గిల్ సెంచరీ చేయడం విశేషం. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం గిల్ తో పాటు సిరాజ్, డెవోన్ కాన్వే పోటీ పడ్డారు. గతేడాది అక్టోబర్ లో విరాట్ కోహ్లి తర్వాత ఈ అవార్డు అందుకున్న ఇండియన్ ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

తనకు ఈ అవార్డు దక్కడంపై గిల్ స్పందించాడు. "ఐసీసీ ప్యానెల్, క్రికెట్ అభిమానులకు నాకు ఓటేసి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. జనవరి నాకు ప్రత్యేకమైన నెల. ఈ అవార్డు దానిని మరింత స్పెషల్ గా మార్చేసింది. ఈ సక్సెస్ కు కారణమైన టీమ్ మేట్స్, కోచ్ లుకు రుణపడి ఉంటాను. వన్డే వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి" అని గిల్ అన్నాడు.

ఇక ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్ కు దక్కింది. ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా ఆమె నిలిచింది. అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఆమె నిలకడగా రాణించింది.