ICC Player of the Month Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో సిరాజ్, శుభ్‌మన్ గిల్-icc player of the month award siraj and subhman gill nominated for january ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Player Of The Month Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో సిరాజ్, శుభ్‌మన్ గిల్

ICC Player of the Month Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో సిరాజ్, శుభ్‌మన్ గిల్

Hari Prasad S HT Telugu
Feb 07, 2023 04:30 PM IST

ICC Player of the Month Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. జనవరి నెలలో అద్భుతంగా రాణించిన ఈ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ ను అవార్డు కోసం నామినేట్ చేశారు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉన్న మహ్మద్ సిరాజ్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉన్న మహ్మద్ సిరాజ్ (AFP)

ICC Player of the Month Award: ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ప్లేయర్స్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్. ఈ ఇద్దరూ గత జనవరి నెలలో అద్భుతంగా రాణించారు. దీంతో ఆ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఈ ఇద్దరినీ మంగళవారం (ఫిబ్రవరి 7) ఐసీసీ నామినేట్ చేసింది.

yearly horoscope entry point

ఇక ఈ ఇద్దరితోపాటు న్యూజిలాండ్ బ్యాటర్ డెవోన్ కాన్వే కూడా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు. కొత్త ఏడాదిని కాన్వే అద్భుతంగా ప్రారంభించాడు. అతడు అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఇండియన్ ప్లేయర్ గిల్ విషయానికి వస్తే 2022లో తన టాప్ ఫామ్ ను కొత్త ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు.

టెస్టులకే పరిమితమైన తన పర్ఫార్మెన్స్.. వన్డేలు, టీ20ల్లో కూడా కొనసాగింది. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలోనే డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్ లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.

తర్వాత న్యూజిలాండ్ తో టీ20ల్లోనూ రెచ్చిపోయాడు. ఈ ఫార్మాట్ కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ చేశాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రమంగా ఇండియన్ టీమ్ లో ప్రధాన బౌలర్ గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం