తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Men’s Player Of The Month: ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో ఆ ముగ్గురు

ICC Men’s Player of the Month: ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో ఆ ముగ్గురు

Hari Prasad S HT Telugu

06 December 2022, 21:26 IST

    • ICC Men’s Player of the Month: ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో ముగ్గురు ప్లేయర్స్‌ నిలిచారు. వాళ్ల పేర్లను ఐసీసీ మంగళవారం (డిసెంబర్‌ 6) ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో జోస్ బట్లర్
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో జోస్ బట్లర్ (AFP)

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో జోస్ బట్లర్

ICC Men’s Player of the Month: ఐసీసీ ప్రతి నెలా ఇచ్చే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో నవంబర్‌ నెలకుగాను ముగ్గురు ప్లేయర్స్‌ ఉన్నారు. వీళ్లలో ఇద్దరు ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ కాగా.. ఒకరు పాకిస్థాన్‌ ప్లేయర్‌. ఇంగ్లండ్‌ టీమ్‌ నుంచి జోస్‌ బట్లర్‌, ఆదిల్‌ రషీద్‌ రేసులో ఉండగా.. పాకిస్థాన్‌ నుంచి పేస్‌ బౌలర్‌ షహీన్‌ అఫ్రిది ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌, పాకిస్థానే తలపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ ట్రోఫీ గెలవగా.. ఆ టీమ్‌లో జోస్‌ బట్లర్‌, ఆదిల్‌ రషీద్‌ ఉన్నారు. ఇక టోర్నీ మొత్తం రాణించిన పాక్‌ బౌలర్‌ షహీన్‌ అఫ్రిది.. ఫైనల్లో కీలక సమయంలో గాయపడి చివర్లో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌కు విజయవంతంగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ అందించిన బట్లర్‌ ఈ రేసులో ముందున్నాడని చెప్పొచ్చు.

ఇక సెమీఫైనల్లో ఇండియాను 10 వికెట్లతో ఇంగ్లండ్‌ ఓడించడంలోనూ బట్లర్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ సాయపడింది. నవంబర్‌లో ఇండియా, న్యూజిలాండ్‌లపై టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలతోపాటు మొత్తం 207 రన్స్‌ చేశాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లో బట్లర్‌ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అటు మరో ఇంగ్లండ్ ప్లేయర్‌ ఆదిల్‌ రషీద్‌ వరల్డ్‌కప్‌ తొలి మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయినా.. తర్వాత పుంజుకున్నాడు. శ్రీలంకపై 4 ఓవర్లలో కేవలం 16 రన్స్‌ ఒక వికెట్‌ తీసుకొని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక గాయంతో కొంతకాలం పాటు పాక్‌ టీమ్‌కు దూరంగా ఉండి వరల్డ్‌కప్‌కు తిరిగి వచ్చిన షహీన్‌ షా అఫ్రిది.. తన సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 22 పరుగులకు 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లో 11 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.