తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik On Vaughan Comments: భారత్ చెత్త ప్రదర్శన చేసిందన్న ఇంగ్లాండ్ మాజీ.. అదిరే కౌంటర్ ఇచ్చిన హార్దిక్

Hardik on Vaughan Comments: భారత్ చెత్త ప్రదర్శన చేసిందన్న ఇంగ్లాండ్ మాజీ.. అదిరే కౌంటర్ ఇచ్చిన హార్దిక్

16 November 2022, 13:34 IST

    • Hardik on Vaughan Comments: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిందని విమర్శలు సంధించాడు. అతడి వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య అదిరే కౌంటర్ ఇచ్చాడు.
హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AFP)

హార్దిక్ పాండ్య

Hardik on Vaughan Comments: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలం కావడంపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ భారత జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టుగా అభివర్ణించాడు. పవర్ ప్లేలో ఓవర్‌కు ఒక్కో పరుగు మాత్రమ తీసిందని, పసికూన జట్టు అయినా యూఏఈ కంటే కూడా అత్యంత చెత్తగా ఆడిందని విమర్శించాడు. జట్టు బలంగా ఉన్నా, ప్రతిభావంతులు ఉన్నా కూర్పు సరిగ్గా లేదని తెలిపాడు. వాన్ వ్యాఖ్యలపై భారత అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య ఈ అంశంపై స్పందించాడు. నొప్పించకా తానొప్పక అనే రీతిలో క్లాసీ రెస్పాన్స్ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"సరిగ్గా ఆడనప్పుడు కచ్చితంగా ప్రజల నుంచి విభిన్న రకాల అభిప్రాయాలు, మాటలు వస్తుంటాయి. వాటిని మేము గౌరవిస్తాం. ప్రజలకు వివిధ రకాల దృక్పథాలు ఉంటాయని అర్థం చేసుకుంటాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మేము.. ఎవరి కోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఇది ఆట.. నిత్యం మెరుగవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫలితం అనుకూలంగా వస్తుంది. మేము కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. భవిష్యత్తులో ఆ సమస్యలను పరిష్కరించుకుంటాం. టీ20 వరల్డ్ కప్ ఓటమి వల్ల నిరాశ చెందాం. కానీ మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మెరుగుపడటానకి తప్పులు సరిదిద్దుకోవడానికి చూస్తాం." అని హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు.

ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా నియమితుడవగా.. వన్డే జట్టుకు సారథిగా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. రెగ్యలర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ప్రధాన ఆటగాళ్లు జట్టులో లేనప్పటికీ ప్రతిభ ఉన్నవారు ఉన్నారని హార్దిక్ తెలిపాడు.

"ప్రధాన ప్లేయర్లు జట్టులో లేరు. కానీ ప్రతిభ ఉన్న వారు ఎంతో మంది ఇక్కడ ఉన్నరు. ఒకటిన్నర సంవత్సరాలుగా టీమిండియా తరఫున ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోడానికి తగినంత సమయం ఉంది. కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. కొత్త బెంచ్, సరికొత్త ఎనర్జి కాబట్టి ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది."అని హార్దిక్ పాండ్య తెలిపాడు.