తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Retention: మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఉంచుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!

IPL 2023 Retention: మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఉంచుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!

08 January 2024, 22:11 IST

google News
    • IPL 2023 Retention: ఐపీఎల్ 2023కి ఇంకా ఆరు నెలల సమయముండగా.. వచ్చే నెలలో ఈ సీజన్ కోసం మినీ వేలం జరగనుంది ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లలో కొంతమందిని వదిలేయాలని నిర్ణయించుకున్నాయి. మరి ఎవరెవరిని వదులుకున్నాయి? ఎవరిని ఉంచుకున్నాయి? లాంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్స్, డ్వేన్ బ్రేవో లాంటి ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వదులుకున్నాయి.
మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్స్, డ్వేన్ బ్రేవో లాంటి ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వదులుకున్నాయి. (IPL)

మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్స్, డ్వేన్ బ్రేవో లాంటి ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వదులుకున్నాయి.

IPL 2023 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు ఇంకా ఆరు నెలల సమయముండగానే.. అప్పుడే ఐపీఎల్ హడావిడి మొదలైంది. అయితే ఈ సారి జట్ల పునరుద్ధరణలో భాగంగా మొత్తం 10 ఫ్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదిలేయాలని నిర్ణయించుకున్నాయి. డిసెంబరు 23న జరగనున్న మినీ వేలంలో పాల్గొనేందుకు ఉత్సుకతో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్‌లో కీలకమైన కీరన్ పొలార్డ్ ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు మొత్తం 12 మంది విడిచిపెట్టింది. అయితే అన్నిటికంటే పెద్దమార్పు సన్‌రైజర్స్ హైదరాబాద్ జరిగింది. కేన్ విలియమ్సన్‌ను హైదరాబాద్ విడిచిపెట్టింది. పంజా కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ బ్రావోను వదులకున్నాయి.

మొత్తంగా 87 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు వదులుకున్నాయి. ఎందుకంటే తమ వద్ద అందుబాటులో ఉన్న డబ్బుతో జట్టును తిరిగి రీసెట్ చేయాలని వేలానికి మొగ్గు చూపాయి.ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఎవరిని ఉంచుకున్నాయి, ఎవరిని వద్దనుకున్నాయో వారి ఆటగాళ్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్..

వదలుకున్న ఆటగాళ్లు:

డ్వాన్ బ్రేవో, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కేఎం ఆసిఫ్, నారయన్ జగదీశన్.

ఉంచుకున్న ఆటగాళ్లు:

ఎంఎస్ ధోనీ(కెప్టెన్) , డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దుబే, రాజ్‌వర్ధన్ హంగ్రేజ్‌కర్, డ్వేన్ ప్రిటోరియస్, మిషెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ చౌదరి, మతీశా పతిరానా, సిమర్జీత్ సింగ్, దీపక్ చహార్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు ఉండగా.. తన వద్ద అందుబాటులో ఉన్న సొమ్ము వచ్చేసి రూ.20.45 కోట్లు.

ముంబయి ఇండియన్స్..

వదులుకున్న ఆటగాళ్లు:

కీరన్ పోలార్డ్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపీ, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కట్, మయాంక్ మర్కాండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, త్యామల్ మిల్స్

ఉంచుకున్న ఆటగాళ్లు:

రోహిత్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రమన్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవాల్డ్ బ్రూవీస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ తెందూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జేసన్ బెహండార్ఫ్, ఆకాశ్ మద్వాల్

విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మూడు ఉండగా.. ఈ జట్టు వద్ద మిగిలిన సొమ్ము వచ్చేసి రూ,20.55 కోట్లుగా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్..

వదులుకున్న ప్లేయర్లు:

కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరబ్ దుబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.

ఉంచుకున్న ఆటగాళ్లు:

అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శ్రమ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజాల్‌హక్ ఫరూఖీ, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

నాలుగు విదేశీ ఆటగాళ్లు స్లాట్లు ఉండగా.. ఈ జట్టు వద్ద మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.42.25 కోట్లు

దిల్లీ క్యాపిటల్స్..

వదులుకున్న ప్లేయర్లు:

శార్దూల్ ఠాకూర్, టిమ్ సెఫెర్ట్, అశ్విన్ హెబ్బర్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్.

ఉంచుకున్న ప్లేయర్లు:

రిషభ్ పంత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపల్ పటేల్, రోమన్ పోవెల్, సర్ఫరాజ్ ఖాన్, యాశ్ ధుల్, మిషెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దుబే, విక్కీ ఓస్త్వాల్.

రెండు విదేశీ స్లాట్లు ఉండగా.. మిగిలిన సొమ్ము వచ్చేసి ఈ జట్టు వద్ద రూ.19.45 కోట్లు ఉంది.

రాజస్థాన్ రాయల్స్..

వదులుకున్న ఆటగాళ్లు:

అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డ్యారి మిషెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్ నైల్, రసీ వాన్ డేర్ డసేన్, శుభ్‌మన్ గార్వాల్, తేజస్ బారోకా.

ఉంచుకున్న ప్లేయర్లు:

సంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రన్ హిట్మైర్, దేవ్‌దత్ పడిక్కల్, జాస్ బట్లర్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, ప్రసిధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెకాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యజువేంద్ర చాహల్, కేసీ కరియప్ప.

నాలుగు విదేశీ స్లాట్లు ఉండగా.. ఈ జట్టు వద్ద మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.13.2 కోట్లు ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

వదులుకున్న ప్లేయర్లు:

జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చెమా మిలింద్, లువ్‌నిత్ సిసోడియా, షెర్ఫానే రూథర్‌ఫర్డ్

ఉంచుకున్న ప్లేయర్లు:

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాశ్ ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, దినేశ్ కార్తిక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, వానిండు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కరన్ శర్మ, మహిపాల్ లోమోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాశ్ దీప్.

రెండు విదేశీ స్లాట్లు ఉండగా.. ఈ జట్లు ఇంకా మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.8.75 కోట్లు.

లక్నో సూపర్ జెయింట్స్..

వదులుకున్న ప్లేయర్లు:

ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత చమీరా, ఎవిన్ లూయీస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే, షాబాజ్ నదీమ్

ఉంచుకున్న ప్లేయర్లు:

కేఎల్ రాహుల్(కెప్టెన్), ఆయూష్ బదోని, కరన్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినీస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్య, ఆవేశ్ ఖాన్, మొహిసిన్ ఖాన్, మార్క్‌వుడ్, మయాంక్ యాదవ్, రవి భిష్ణోయ్.

నాలుగు విదేశీ స్లాట్లు ఉండగా.. మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.23.35 కోట్లుగా ఉంది.

గుజరాత్ టైటాన్స్..

వదులుకున్న ప్లేయర్లు:

రహమతుల్లా గుర్బాజ్, లోకీ ఫెర్గ్యూసన్, డోమనిక్ డ్రేకర్స్, గుర్‌క్రీత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్.

ఉంచుకున్న ప్లేయర్లు:

హార్దిక్ పాండ్య(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నాల్కాండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిశోర్, నూర్ అహ్మద్.

మూడు విదేశీ స్లాట్లు ఉండగా.. మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.19.25 కోట్లు.

కోల్‌కతా నైట్ రైడర్స్..

వదులుకున్న ప్లేయర్లు:

ప్యాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమార్, అజింక్యా రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజీత్, ప్రాథమ్ సింగ్, రమేశ్ కుమార్, రసిక్ సలాం, షెల్డాన్ జాక్సన్.

ఉంచుకున్న ప్లేయర్లు:

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీశ్ రానా, రహమతుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రే రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లోకీ ఫెర్గ్యూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అంకుల్ రాయ్, రింకూ సింగ్.

మూడు విదేశీ స్లాట్లు ఉండగా.. మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.7.05 కోట్లుగా ఉంది.

పంజాబ్ కింగ్స్..

వదులుకున్న ఆటగాళ్లు:

మయాంక్ అగర్వాల్, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, వృత్తిక్ చటర్జీ.

ఉంచుకున్న ప్లేయర్లు:

శిఖర్ ధావన్(కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, రాజ్ బవా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అధర్వా తైడే, అర్ష్‌దీప్ సింగ్, బాల్‌తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత బ్రార్.

మూడు విదేశీ స్లాట్లు ఉండగా.. మిగిలిన సొమ్ము వచ్చేసి రూ.32.2 కోట్లుగా ఉంది.

తదుపరి వ్యాసం