తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Kohli Vs Sachin: సచిన్‌ రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తాడా.. గంగూలీ సమాధానమిదీ

Ganguly on Kohli vs Sachin: సచిన్‌ రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తాడా.. గంగూలీ సమాధానమిదీ

Hari Prasad S HT Telugu

12 January 2023, 9:25 IST

    • Ganguly on Kohli vs Sachin: తన ఫ్రెండ్‌ సచిన్‌ రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తాడా? ఈ ఆసక్తికర చర్చపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. శ్రీలంకతో తొలి వన్డేలో మరో సచిన్‌ రికార్డును కోహ్లి సమం చేసిన నేపథ్యంలో మరోసారి ఈ చర్చ జరుగుతోంది.
విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ (AP-PTI)

విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్

Ganguly on Kohli vs Sachin: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఒకడు సచిన్‌ టెండూల్కర్‌. క్రికెట్‌ గాడ్‌గా పేరుగాంచిన మాస్టర్‌ రికార్డులు బ్రేక్‌ చేయడం అసాధ్యమన్న వాదన చాలా రోజులుగా ఉంది. అయితే క్రికెట్‌లో రికార్డులు ఉన్నవి బ్రేక్‌ చేయడానికే అన్నట్లుగా ఇప్పుడు విరాట్‌ కోహ్లి చెలరేగిపోతున్నాడు. తాజాగా అతడు వన్డేల్లో 45వ సెంచరీ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మూడేళ్లకుపైగా సెంచరీ కోసం తహతహలాడిన అతడు.. వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలతో చెలరేగాడు. దీంతో మరోసారి మాస్టర్‌ రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తాడా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డేల్లో సచిన్‌ సెంచరీల రికార్డుకు కోహ్లి చేరువగా వచ్చాడు. టెండూల్కర్‌ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. వన్డేల్లో మరో నాలుగు సెంచరీలు చేస్తే కోహ్లి సచిన్‌ను సమం చేస్తాడు.

వన్డేల్లో సెంచరీల రికార్డును బ్రేక్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఓవరాల్‌గా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సచిన్‌ 100 సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్‌ 73 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈ కోహ్లి వర్సెస్‌ సచిన్‌ చర్చపై స్పందించాడు. అతడు ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

"ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కోహ్లి అద్భుతమైన ప్లేయర్‌. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఎన్నో ఆడాడు. 45 సెంచరీలు ఏదో అలా చేసేయడం కుదరదు. అతని దగ్గర ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. కొన్నిసార్లు అతడు పరుగులు సాధించకపోవచ్చు. కానీ అతడో ప్రత్యేకమైన ప్లేయర్‌" అని గంగూలీ అన్నాడు.

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్‌ 87 బాల్స్‌లో 113 రన్స్‌ చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలోనూ విరాట్‌ సరిగ్గా 113 రన్సే చేయడం విశేషం. విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో 12580 రన్స్‌ చేశాడు. గురువారం (జనవరి 12) శ్రీలంకతో ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండో వన్డే జరగబోతోంది.