Gautam Gambhir On Kohli Record : కోహ్లిని సచిన్‌తో పోల్చడం కరెక్ట్ కాదు-you cant compare virat kohli with sachin says gautam gambhir ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  You Cant Compare Virat Kohli With Sachin Says Gautam Gambhir

Gautam Gambhir On Kohli Record : కోహ్లిని సచిన్‌తో పోల్చడం కరెక్ట్ కాదు

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 08:23 PM IST

IND Vs SL 1st ODI : శ్రీలంకతో మెుదటి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. సచిన్ రికార్డును సమం చేశాడు. అయితే దీనిపై గౌతం గంభీర్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

గౌతం గంభీర్
గౌతం గంభీర్ (twitter)

శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) దూసుకెళ్లాడు. బ్యాట్ తో చెలరేగిపోయాడు. దీంతో సచిన్(Sachin) రికార్డును సమం చేశాడు. అయితే దీనిపై.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) స్పందించాడు. సచిన్‌ తో కోహ్లిని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించాడు.

ట్రెండింగ్ వార్తలు

సచిన్ సమయంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమయ్యేదని.. గంభీర్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఫీల్డ్ ఆంక్షలు కఠినంగా ఉండేవన్నాడు. ఫీల్డ్‌లో 30 యార్డ్‌ సర్కిల్‌ వెలుపల 5 మం‍ది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారని చెప్పాడు. దీంతో బౌండరీలు కొట్టడం కష్టంగా ఉండేదని గంభీర్ వివరించాడు.

వన్డే కెరిర్లో విరాట్ కోహ్లీ 45వ సెంచరీని నమోదు చేశాడు. స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు 20 చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో వన్డేల్లో ఈ ఘనత సాధించాడు కోహ్లీ. సచిన్, కోహ్లి ఇద్దరికీ 20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో 153 మ్యాచ్‌ల్లో 13 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక మూడు ఫార్మాట్లలో చూసుకుంటే.. కింగ్ కోహ్లీకి ఇది 73వ సెంచరీ. వన్డేల్లో టెస్టుల్లో 27, టీ20ల్లో సెంచరీ సాధించాడు. తాజాగా స్వదేశంలో 20 వన్డే సెంచరీలు చేశాడు. దీంతో లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. శ్రీలంకతో తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు. వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 45 వన్డే సెంచరీతో కోహ్లీ ఇప్పుడు శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేశాడు.

స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మెుదటి వన్డేలో 80 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేయడానికి.. సచిన్ 160 ఇన్నింగ్స్ ఆడితే.., కోహ్లీ 102 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 12500 పరుగులు చేసేందుకు కోహ్లి 257 మ్యాచ్‌లు అవసరం అయ్యాయి. సచిన్‌ 310 మ్యాచ్‌ల్లో ఈ మార్క్ దాటాడు.

WhatsApp channel