తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Babar And Rizwan World Record: టీ20ల్లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన పాకిస్థాన్‌ ఓపెనర్లు

Babar and Rizwan World Record: టీ20ల్లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన పాకిస్థాన్‌ ఓపెనర్లు

Hari Prasad S HT Telugu

23 September 2022, 9:27 IST

    • Babar and Rizwan World Record: టీ20ల్లో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు పాకిస్థాన్‌ టీమ్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వాళ్లు ఈ కొత్త రికార్డును సృష్టించారు.
టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం
టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (AP)

టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం

Babar and Rizwan World Record: పాకిస్థాన్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ టీ20ల్లో మరోసారి సంచలనం సృష్టించారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 152 రన్స్‌ టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా ఈ జోడీ చేజ్‌ చేసిన విషయం తెలుసు కదా. మరోసారి దానిని రిపీట్‌ చేశారు. అయితే ఈసారి మరింత ఘనంగా, ఏకంగా 200 రన్స్‌ టార్గెట్‌ను వికెట్‌ కోల్పోకుండా చేజ్‌ చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇంగ్లండ్‌తో గురువారం (సెప్టెంబర్‌ 22) జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఈ మ్యాచ్‌ను 10 వికెట్లతో గెలిచి 7 టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది పాకిస్థాన్‌. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్‌కు చాలా బలంగా పుంజుకున్న ఆ టీమ్‌.. ఇంగ్లండ్‌కు షాకిచ్చింది.

డబుల్‌ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో వరల్డ్‌ రికార్డ్‌

టీ20ల్లో చేజింగ్‌లో వికెట్‌ కోల్పోకుండా 200 రన్స్‌ టార్గెట్‌ చేజ్‌ చేయడం ఓ కొత్త వరల్డ్‌ రికార్డ్‌. బాబర్‌ ఆజం సెంచరీ, రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీతో ఈ రికార్డు పాక్‌ ఓపెనర్ల సొంతమైంది. ఇంతకుముందు 197 రన్స్‌తో తమ పేరిటే ఉన్న రికార్డును వీళ్లు మెరుగుపరచుకోవడం విశేషం. ఇక టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇది ఐదో అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌.

బాబర్‌ ఆజం 66 బాల్స్‌లోనే 110 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. అటు రిజ్వాన్‌ 51 బాల్స్‌లో 88 రన్స్‌ చేశాడు. దీంతో పాకిస్థాన్‌ 19.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే 203 రన్స్‌ చేసి విజయం సాధించింది. ఆసియాకప్‌లో శ్రీలంక చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమితో హ్యాట్రిక్‌ సాధించిన పాక్‌.. ఈ మ్యాచ్‌తో దానిని బ్రేక్‌ చేసింది.

ఈ ఇద్దరి మెరుపులతో కరాచీ స్టేడియం ఉర్రూతలూగిపోయింది. అంతకుముందుక మొయిన్‌ అలీ (23 బాల్స్‌లో 55) మెరుపులతో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 రన్స్‌ చేసింది. బెన్‌ డకెట్‌ కూడా 22 బాల్స్‌లో 43 రన్స్‌ చేశాడు. కానీ ఇంత భారీ స్కోరును పాకిస్థాన్‌ ఇంత సులువుగా చేజ్‌ చేస్తుందని ఇంగ్లండ్ ఊహించలేకపోయింది.