తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia Vs England: మెల్‌బోర్న్‌లో రూఫ్‌ ఉన్న స్టేడియాన్ని అందుకే వాడలేదు: ఆస్ట్రేలియా కోచ్‌

Australia vs England: మెల్‌బోర్న్‌లో రూఫ్‌ ఉన్న స్టేడియాన్ని అందుకే వాడలేదు: ఆస్ట్రేలియా కోచ్‌

Hari Prasad S HT Telugu

28 October 2022, 18:04 IST

    • Australia vs England: మెల్‌బోర్న్‌లో రూఫ్‌ ఉన్న స్టేడియాన్ని వాడకపోవడంపై ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ స్పందించాడు. వర్షాలు పడుతున్న ఈ సమయంలో మెల్‌బోర్న్‌లోనే ఉన్న రూఫ్‌ స్టేడియం డాక్‌లాండ్స్‌ను ఎందుకు వాడటం లేదన్న సందేహాల నేపథ్యంలో అతడు రియాక్టయ్యాడు.
మెల్‌బోర్న్‌లో ఉన్న రూఫ్‌ స్టేడియం డాక్‌లాండ్స్‌
మెల్‌బోర్న్‌లో ఉన్న రూఫ్‌ స్టేడియం డాక్‌లాండ్స్‌ (Twitter)

మెల్‌బోర్న్‌లో ఉన్న రూఫ్‌ స్టేడియం డాక్‌లాండ్స్‌

Australia vs England: టీ20 వరల్డ్‌కప్‌కు, అందులోనూ మెల్‌బోర్న్‌లో జరగాల్సిన మ్యాచ్‌లకు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. శుక్రవారం (అక్టోబర్‌ 28) ఎంసీజీలో జరగాల్సిన రెండు మ్యాచ్‌లూ కనీసం టాస్‌ పడకుండానే రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌లోనే రూఫ్‌తో కూడిన డాక్‌లాండ్స్‌స్టేడియాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీనిపై ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ స్పందించాడు. వర్షాకాలంలో మెల్‌బోర్న్‌లోని ఈ డాక్‌లాండ్స్‌ స్టేడియాన్ని ఉపయోగించాలా వద్దా అన్నది ఐసీసీ చేతుల్లో ఉంటుందని మెక్‌డొనాల్డ్‌ చెప్పాడు. ఈ స్టేడియాన్ని బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు. గతంలో కొన్ని వన్డే మ్యాచ్‌లు కూడా ఇందులో జరిగాయి.

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ నుంచి ఈ డాక్‌లాండ్స్‌ స్టేడియం 5 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే ప్రతిష్టాత్మక ఎంసీజీలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడానికి మొగ్గు చూపుతారు. ఈసారి కూడా అందుకే ఇండియా, పాకిస్థాన్‌లాంటి మ్యాచ్‌తోపాటు ముఖ్యమైన మ్యాచ్‌లను ఇందులో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ఈ నేపథ్యంలో డాక్‌లాండ్స్‌ స్టేడియంపై తెరపైకి వచ్చింది. దీనిపై ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ స్పందిస్తూ.. "నాకు తెలిసి అందరూ ఎంసీజీలోనే ఆడటానికి ఇష్టపడతారు. మనం వాతావరణాన్ని అంచనా వేయలేం. కానీ మెల్‌బోర్న్‌ ప్రేక్షకులు మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్ చూడటానికి వస్తారు.

అలాంటి మ్యాచ్‌కు ఎంసీజీ కంటే ఉత్తమమైన స్టేడియం మరొకటి ఉండదు. ఒకవేళ రూఫ్‌ ఉన్న స్టేడియం (డాక్‌లాండ్స్‌)లో ఆడాలనుకుంటే అది షెడ్యూలింగ్‌ వాళ్లు చూసుకుంటారు. అది దగ్గరల్లోనే ఉంది కానీ దానిని క్రికెట్‌ కోసమే ప్రత్యేకంగా నిర్మించలేదు" అని అన్నాడు.

శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దయిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ జొనాథన్ ట్రాట్‌ కూడా ఈ డాక్‌లాండ్స్‌ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నాడు. ఒకవేళ అలా చేసి ఉంటే ఇంత క్రికెట్‌ నష్టపోయి ఉండేవాళ్లం కాదని ట్రాట్‌ అభిప్రాయపడ్డాడు.