తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sharad Purnima: శరత్ పౌర్ణమి రోజు ఖీర్ ను ఎందుకు చంద్రుడి కాంతిలో ఉంచుతారు?

Sharad Purnima: శరత్ పౌర్ణమి రోజు ఖీర్ ను ఎందుకు చంద్రుడి కాంతిలో ఉంచుతారు?

Gunti Soundarya HT Telugu

15 October 2024, 15:00 IST

google News
    • Sharad Purnima: శరత్ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా ఖీర్ తయారు చేసి సమర్పిస్తారు. ఈ ఖీర్ ను సాయంత్రం వేళ చంద్ర కాంతిలో కొద్ది సేపు ఉంచాలని చెబుతారు. ఇలా ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న అర్థం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. 
శరత్ పూర్ణిమ రోజు ఖీర్ ఎందుకు చంద్రకాంతిలో ఉంచాలి?
శరత్ పూర్ణిమ రోజు ఖీర్ ఎందుకు చంద్రకాంతిలో ఉంచాలి?

శరత్ పూర్ణిమ రోజు ఖీర్ ఎందుకు చంద్రకాంతిలో ఉంచాలి?

హిందూ మతంలో తీజ్ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నవరాత్రి పండుగ తర్వాత పండుగల సీజన్‌ మొదలైంది. దసరా తర్వాత శరత్ పూర్ణిమ రాబోతోంది. శరత్ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

లేటెస్ట్ ఫోటోలు

Pawan Kalyan Global Searches : సీజ్ ది షిప్.. పవన్ అంటే లోకల్ అనుకుంటిరా.. కాదు ఇంటర్నేషనల్!

Dec 12, 2024, 03:31 PM

గజకేసరి యోగంతో వీరికి ఎటు చూసినా లక్కే.. మీ అడుగులు విజయం వైపు పడతాయి!

Dec 12, 2024, 03:24 PM

Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు.. మహానటి ఎంత అందంగా, ఆనందంగా ఉందో చూశారా?

Dec 12, 2024, 03:17 PM

AP TG Weather Report : బలహీనపడనున్న అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన..! తెలంగాణలో చలి తీవ్రత, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Dec 12, 2024, 03:06 PM

Mercury Transit: వృశ్చిక రాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం: ఐదు రాశుల వారిపై ప్రభావం

Dec 12, 2024, 03:01 PM

Best leafy Vegetable Spinach: బచ్చలి ఆకులతో బహుళ ప్రయోజనాలు, ఈ విషయాలు తెలిస్తే అసలు వదలరు…

Dec 12, 2024, 02:25 PM

ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ అక్టోబర్ 16 న వస్తుంది. పౌర్ణమి తిథి అక్టోబర్ 16 బుధవారం సాయంత్రం 6.56 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17 సాయంత్రంతో తిథి ముగుస్తుంది. చంద్రోదయం పరిగణలోకి తీసుకుని శరత్ పూర్ణిమను అక్టోబర్ 16న జరుపుకుంటారు. శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో ఉంచిన ఖీర్ తినడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ఖీర్ మతపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా శాస్త్రీయ కారణాల వల్ల కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.

పౌర్ణమి రోజు చంద్రుడు తన పూర్తి పదహారు కళలతో ఉంటాడని నమ్ముతారు. ఈరోజు చంద్రుడి కిరణాల నుంచి అమృతం వస్తుంది. ఇది శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఖీర్ తయారు చేసి సాయంత్రం చంద్రోదయం సమయంలో కాసేపు వెన్నెల వెలుగులో ఆరుబయట ఉంచాలి. ఇలా చేయడం వల్ల చంద్రుడి కాంతి వల్ల ఖీర్ అమృతంగా మారుతుందని విశ్వసిస్తారు. దీన్ని తీసుకుంటే అనేక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం.

చంద్రకాంతిలో ఖీర్ ఎందుకు ఉంచుతారు?

శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో ఖీర్ ఉంచడం వెనుక ఉన్న నమ్మకాల ప్రకారం ఈ రోజున చంద్రుడు రాత్రంతా తన చంద్రకాంతితో అమృతాన్ని కురిపిస్తాడు. శరద్ పూర్ణిమ రాత్రి బహిరంగ ఆకాశంలో ఖీర్ ఉంచబడడమే దీనికి కారణం. ఈ ఖీర్ తిన్న వ్యక్తికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

అనేక వ్యాధులు నయమవుతాయి

శరత్ పూర్ణిమ రాత్రి ఆకాశం నుండి అమృతంతో నిండిన కిరణాలు భూమిపై పడతాయని నమ్ముతారు. ఈ అమృత కిరణాలకు అనేక వ్యాధులను దూరం చేసే శక్తి ఉంది. శరత్ పూర్ణిమ రోజు రాత్రి ప్రజలు ఖీర్‌ను ఇంటి పైకప్పుపై ఉంచి తింటారు.

పాలు అమృతం అవుతుంది

మత విశ్వాసాల ప్రకారం పాలు చంద్రునికి సంబంధించినవిగా పరిగణిస్తారు. ఈ రోజున చంద్రునికి సంబంధించిన విషయాలు మేల్కొని అమృతంలా మారుతాయని నమ్ముతారు. చంద్రకాంతిలో తయారుచేసిన ఈ ఖీర్ తినడం వల్ల కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీ, ఆనందం కలుగుతాయి. పాలతో ఖీర్ తయారు చేసి చంద్రకాంతిలో ఉంచడానికి కారణం ఇదే.

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

శరత్ పూర్ణిమ రోజున చేసే ఖీర్‌లో పోషక విలువలు ఉంటాయి. ఈ ఖీర్‌కు జోడించిన పదార్థాలు వ్యక్తి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. దీని వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

చంద్ర దోషం తొలగిపోతుంది

మత విశ్వాసాల ప్రకారం శరత్ పూర్ణిమ రోజున ఖీర్ ప్రసాదాన్ని తయారు చేయడం వలన వ్యక్తి నుండి చంద్ర దోషం తొలగిపోతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం