Krishna Janmashtami: జన్మాష్టమి రోజున సాయంత్రం ఇలా చేస్తే మీకు ఏడాదంతా డబ్బుకి లోటు ఉండదు
Krishna Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని దేశం మొత్తం ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోంది. బాల గోపాల్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా పవిత్రమైన సందర్భంగా భక్తులు భావిస్తారు.
Janmashtami 2024: దేశ వ్యాప్తంగా ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమిని అత్యంత వైభవంగా భక్తులు జరుపుకుంటున్నారు. శ్రీ కృష్ణుడి ఆలయాల్లో ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి బాలగోపాల్ పుట్టిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా సర్వార్థ సిద్ధి యోగం, జయంతి యోగం, బలవ్, కౌలవ్ కరణ్, కృతిక నక్షత్రంతో అనేక శుభకార్యాలు ఏర్పడుతున్నాయి. జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని లడ్డూగోపాల్‌ను భక్తులు పూజిస్తున్నారు.
శ్రావణ మాసంలో ఎనిమిదో రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రతీతి. ఈ రోజున కన్నయ్య ఆరాధనతో పాటు తులసికి కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు కూడా భక్తులు చేస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని బాధలు తొలగిపోయి ఇంటికి సిరి సంపదలు వస్తాయని భక్తుల విశ్వాసం.
శ్రీకృష్ణుడికి తులసి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున కృష్ణుడికి ప్రేమతో మిష్రీని సమర్పించండి. అందులో కొన్ని తులసి ఆకులను వేయండి. ఇలా చేయడం వల్ల బాలగోపాల్ సంతోషించి ఇంట్లో ఏ లోటూ లేకుండా చేస్తారు.
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధించాలంటే జన్మాష్టమి నాడు లడ్డూగోపాల్‌తో పాటు తులసి మొక్కను కూడా పూజించాలి. సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించాలి.
ఈరోజు కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించండి. సాయంత్రం వేళ ఆమె స్తోత్రాలను పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై ఐశ్వర్యం, సుఖసంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు.
జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంట్లో తులసి మొక్కను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో ఆనందం నెలకొంటుంది. కృష్ణుని అనుగ్రహం కుటుంబ సభ్యులపై ఉంటుందని నమ్ముతారు.
గమనిక :పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.