Dindi Resorts: కుటుంబంతో ఆనందంగా గడపాలనుకుంటున్నారా.. అయితే డిండి రిసార్ట్స్‌కు వెళ్లండి..-dindi resorts is a good place for those who want to have fun with family ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dindi Resorts: కుటుంబంతో ఆనందంగా గడపాలనుకుంటున్నారా.. అయితే డిండి రిసార్ట్స్‌కు వెళ్లండి..

Dindi Resorts: కుటుంబంతో ఆనందంగా గడపాలనుకుంటున్నారా.. అయితే డిండి రిసార్ట్స్‌కు వెళ్లండి..

Aug 20, 2024, 04:36 PM IST Basani Shiva Kumar
Aug 20, 2024, 04:36 PM , IST

  • Dindi Resorts: ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఎప్పుడో కొంచెం టైం దొరికితే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. పిల్లలు, కుటుంబంతో సరదాగా గడపాలని అనుకున్నా.. అందుకు అనువైన ప్రదేశం దొరకదు. అలాంటి వారి కోసమే ఓ చక్కటి టూరిస్ట్ స్పాట్‌ను మీ ముందుకు తెస్తోంది హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

గోదావరి జిల్లాలు.. ఈ పేరు వినగానే పచ్చని కొబ్బరి తోటలు.. గలగలా పారే గోదావరి పరవళ్లు కళ్ల ముందు మెదులుతాయి. నిజమే అచ్చం అలాంటి వాతావరణంలోనే ఉంటుంది డిండి రిసార్ట్స్. గోదావరి నదికి ఆనుకొని.. పచ్చని కొబ్బరి తోటల మధ్య రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏపీ టూరిజం హోటల్ గోదావరి నది పక్కనే ఉంటుంది. అదే కాకుండా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. 

(1 / 7)

గోదావరి జిల్లాలు.. ఈ పేరు వినగానే పచ్చని కొబ్బరి తోటలు.. గలగలా పారే గోదావరి పరవళ్లు కళ్ల ముందు మెదులుతాయి. నిజమే అచ్చం అలాంటి వాతావరణంలోనే ఉంటుంది డిండి రిసార్ట్స్. గోదావరి నదికి ఆనుకొని.. పచ్చని కొబ్బరి తోటల మధ్య రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏపీ టూరిజం హోటల్ గోదావరి నది పక్కనే ఉంటుంది. అదే కాకుండా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. (AP Tourism)

డిండి రిసార్ట్స్‌లో ఏపీ టూరిజం హోటల్ స్పెషల్ అని చెప్పాలి. ఇక్కడ అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడికి ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా సంతోషంగా గడుపుతారు. పిల్లలు, పెద్దలు.. అందరికీ నచ్చేవి ఇక్కడ దొరుకుతాయి. డిండి రిసార్ట్స్‌లోని ఏపీ టూరిజం హోటల్‌లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయి. తక్కువ ధరలో ఇవి లభిస్తాయి. కాకపోతే టూర్ ప్లాన్ చేసుకోగానే వీటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్లాక బుక్ చేసుకుందాం అంటే.. రూమ్‌లు దొరక్కపోవచ్చు. అందుకే ఇక్కడ గదులు అందుబాటులో ఉన్నప్పుడు టూర్ ప్లాన్ చేసుకుంటే బెటర్.

(2 / 7)

డిండి రిసార్ట్స్‌లో ఏపీ టూరిజం హోటల్ స్పెషల్ అని చెప్పాలి. ఇక్కడ అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడికి ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా సంతోషంగా గడుపుతారు. పిల్లలు, పెద్దలు.. అందరికీ నచ్చేవి ఇక్కడ దొరుకుతాయి. డిండి రిసార్ట్స్‌లోని ఏపీ టూరిజం హోటల్‌లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయి. తక్కువ ధరలో ఇవి లభిస్తాయి. కాకపోతే టూర్ ప్లాన్ చేసుకోగానే వీటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్లాక బుక్ చేసుకుందాం అంటే.. రూమ్‌లు దొరక్కపోవచ్చు. అందుకే ఇక్కడ గదులు అందుబాటులో ఉన్నప్పుడు టూర్ ప్లాన్ చేసుకుంటే బెటర్.(AP Tourism)

ఈ హోటల్‌లో పిల్లలు ఆనందంగా గడుపుతారు. వారి కోసం ప్రత్యేకంగా సిమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదీ కాకుండా పార్క్ కూడా ఉంటుంది. దాంట్లో ప్లే ఏరియా ఉంటుంది. కేవలం పిల్లల కోసం కొన్ని రకాల ఆట వస్తువు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన గోదావరి తీరంలో ఇది ఉంటుంది.

(3 / 7)

ఈ హోటల్‌లో పిల్లలు ఆనందంగా గడుపుతారు. వారి కోసం ప్రత్యేకంగా సిమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదీ కాకుండా పార్క్ కూడా ఉంటుంది. దాంట్లో ప్లే ఏరియా ఉంటుంది. కేవలం పిల్లల కోసం కొన్ని రకాల ఆట వస్తువు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన గోదావరి తీరంలో ఇది ఉంటుంది.(AP Tourism)

డిండి రిసార్ట్స్ చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. నరసాపురం వరకు ట్రైన్‌లో వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. రాజమండ్రి వరకు ట్రైన్‌లో వెళితే.. అక్కడి నుంచి రాజోలుకు బస్సులు ఉంటాయి. రాజోలు నుంచి నిమిషాల వ్యవధిలో డిండి రిసార్ట్స్‌కు చేరుకోవచ్చు. కారులో వెళ్లాలనుకువారు కోస్టల్ హైవే ద్వారా డిండి చేరుకోవచ్చు. కోస్టల్ హైవే పక్కనే డిండి రిసార్ట్స్ ఉంటాయి.

(4 / 7)

డిండి రిసార్ట్స్ చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. నరసాపురం వరకు ట్రైన్‌లో వెళ్లి.. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. రాజమండ్రి వరకు ట్రైన్‌లో వెళితే.. అక్కడి నుంచి రాజోలుకు బస్సులు ఉంటాయి. రాజోలు నుంచి నిమిషాల వ్యవధిలో డిండి రిసార్ట్స్‌కు చేరుకోవచ్చు. కారులో వెళ్లాలనుకువారు కోస్టల్ హైవే ద్వారా డిండి చేరుకోవచ్చు. కోస్టల్ హైవే పక్కనే డిండి రిసార్ట్స్ ఉంటాయి.(AP Tourism)

ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, గోదావరి జల సవ్వడి ఆకట్టుకుంటాయి. ఇక్కడికి ఒకసారి వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉన్నవారు ఇక్కడి నుంచి పనిచేసుకోవచ్చు. వైఫై సౌకర్యం ఉంటుంది.

(5 / 7)

ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, గోదావరి జల సవ్వడి ఆకట్టుకుంటాయి. ఇక్కడికి ఒకసారి వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉన్నవారు ఇక్కడి నుంచి పనిచేసుకోవచ్చు. వైఫై సౌకర్యం ఉంటుంది.(AP Tourism)

ఈ ఏపీ టూరిజం హరితా హోటల్‌లో అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. వేజ్, నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక మద్యం ప్రియుల కోసం బార్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఏదైనా వస్తువులు అవసరం ఉంటే.. అక్కడ ఉండే సిబ్బంది తెచ్చిస్తారు.

(6 / 7)

ఈ ఏపీ టూరిజం హరితా హోటల్‌లో అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. వేజ్, నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక మద్యం ప్రియుల కోసం బార్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఏదైనా వస్తువులు అవసరం ఉంటే.. అక్కడ ఉండే సిబ్బంది తెచ్చిస్తారు.(AP Tourism)

డిండి రిసార్ట్స్‌లో బోటింగ్ స్పెషల్. ఇక్కడ మూడు రకాల బోటింగ్ సౌకర్యం ఉంది. మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లే బోట్ 15 నిమిషాల ట్రిప్ ఉంటుంది. పరిమితంగా వెళ్లాలనుకునేవారికి మరో రకమైన బోటింగ్ అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా గౌతమి బోట్ ఉంటుంది. దీంట్లో 24 గంటలూ గోదావరి అలలపైనే ఉండోచ్చు. ఏసీ సౌకర్యంతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిండి నుంచి నరసాపురం వరకు దీన్ని నడుపుతారు. ఆ తర్వాత పార్కింగ్ ప్లేసులో ఉంచుతారు. దీన్ని బుక్ చేసుకున్నవారికి సిబ్బంది అందుబాటులో ఉంటారు.

(7 / 7)

డిండి రిసార్ట్స్‌లో బోటింగ్ స్పెషల్. ఇక్కడ మూడు రకాల బోటింగ్ సౌకర్యం ఉంది. మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లే బోట్ 15 నిమిషాల ట్రిప్ ఉంటుంది. పరిమితంగా వెళ్లాలనుకునేవారికి మరో రకమైన బోటింగ్ అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా గౌతమి బోట్ ఉంటుంది. దీంట్లో 24 గంటలూ గోదావరి అలలపైనే ఉండోచ్చు. ఏసీ సౌకర్యంతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిండి నుంచి నరసాపురం వరకు దీన్ని నడుపుతారు. ఆ తర్వాత పార్కింగ్ ప్లేసులో ఉంచుతారు. దీన్ని బుక్ చేసుకున్నవారికి సిబ్బంది అందుబాటులో ఉంటారు.(AP Tourism)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు