ఆగస్ట్ 25, నేటి రాశి ఫలాలు.. గోమతి చక్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ప్రయోజనాలు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ25.08.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.08.2024
వారం: ఆదివారం, తిథి: సప్తమి
నక్షత్రం: భరణి, మాసం : శ్రావణము
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
అనుకూల సమయం నడుస్తుంది. కోర్టు వ్యవహారాలు, తీర్పులు నెమ్మదిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో కొన్ని ప్రయోజనాలు పొందుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్త్ర వ్యాపారులకు బాగుంటుంది. చేతికి కుబేర కంకణం ధరించండి, లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక, సంఘ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
వృషభం
పట్టుదలతో ముందుకు సాగుతారు. రుణాలు తీరుస్తారు. గృహప్రవేశాది శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ, వ్యయాలు సమానంగా బాగుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సాంబ్రాణితో ధూపం వేయండి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. లలిత కళల పట్ల అభిరుచి కనబరుస్తారు.
మిథునం
ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సర్పదోష నివారణ చూర్ణం, సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయండి . తలస్నానం అవసరం లేదు. సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కొత్త రుణాలు చేస్తారు. బ్యాంకు ఉద్యోగుస్తులకు బాగుంటుంది.
కర్కాటకం
పోటీ పరీక్షల్లో పాల్గొనాలి అన్న ఆలోచనలు బలంగా కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులకు సహాయం అందిస్తారు. మీ ప్రేమ పెళ్లిపీటల వరకు చేరుకుంటుంది. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.
సింహం
అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. శత్రువుల మీద మీదే పై చేయిగా ఉంటుంది. ప్రతి నిమిషం ఆలోచించి, కష్టమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. క్రమశిక్షణ అన్నింటికీ మూలంగా మారుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉపాధి అవకాశాలు బాగుంటాయి.
కన్య
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి ధాన్యం వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. పరిస్థితుల రీత్యా రేటు పెంచి అమ్ముకుంటారు. పోటీ పరీక్షలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సివిల్ కాంట్రాక్టర్లకు బాగుంటుంది. లీజ్, లైసెన్సులు లభిస్తాయి. ప్రజల ఆదరణ, అభిమానం కోసం ఎంత కష్టమైనాపడతారు. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఇష్టదేవతా ఆరాధన సత్ఫలితాలు అందిస్తుంది.
తుల
మీ శక్తి సామర్ధ్యాలు తక్కువగా అంచనా వేసిన వారికి భంగపాటు తప్పదు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తారు. మహా పాశుపత కంకణం ధరించండి. ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజూ దేవతలకు ప్రథమ తాంబూలం సమర్పించండి. పిల్లల పట్ల ఎంతో ప్రేమ వున్నప్పటికీ వారికి కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉండలేరు, వారితో కలిసి గడపలేని పరిస్థితులు ఏర్పడతాయి.
వృశ్చికం
మీ మీద అసూయ, ద్వేషం కలిగినవారు బాధపడే రోజులు వస్తాయి. కొన్ని విజయాల పట్ల మీరు పొంగిపోవద్దు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అష్టమూలికా తైలం, నవగ్రహ వత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీ యత్నాలను ముమ్మరం చేస్తారు. విలాసవంతమైన జీవితం గడపడానికి ఉవ్విళ్లూరుతారు. రావాల్సిన బకాయిలు చేతికంది వస్తాయి.
ధనుస్సు
జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారి అవసరాలు, గృహోపకరణాలు కొనే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నా ఆనందంగా స్వీకరిస్తారు. మరికొన్ని సంవత్సరాల్లో మనం బాగుంటాం అన్న ధైర్యం కలిగి వుంటారు. దుర్గాదేవి శ్లోకం రోజూ చదవండి. భూ సంబంధిత చర్చలు, వాటిలో పురోగతి సాధిస్తారు. మనస్సు తేలిక పడుతుంది. గ్రహస్థితి మీ అలవాట్లలో మార్పులు సూచిస్తోంది.
మకరం
ప్రయోజనాలు చేయి జారనివ్వకుండా చాలా శ్రమిస్తారు. కొత్త ఆర్డర్, ప్రాజెక్టులు సంపాదిస్తారు. నూతన స్నేహాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో అనూహ్యంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి, ఇతరుల నిర్లక్ష్యానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలతో దీపారాధన చేయండి. వినోదాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కళలు, వైద్య రంగాలలోని వారికి అనుకూలం. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా బాగుంటుంది. అష్టమూలికా తైలం, నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీ యత్నాలు ముమ్మరం చేస్తారు.
మీనం
సన్నిహితులు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. భూ- వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రాజకీయ రంగాల్లోనివారికి అనుకూలం. వృత్తి పరంగా కొత్త విశేషాలు తెలుసుకుంటారు.