Krishna Janmashtami 2024: కృష్ణాష్టమి రోజున తులసితో ఇలా చేయండి.. ఈ శుభాలు కలుగుతాయి!
Krishna Janmashtami 2024: కృష్ణాష్టమి రోజున తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీనివల్ల కోరికలు నెరవేరడంతో పాటు మరిన్ని శుభాలు కలుగుతాయి. ఆ వివరాలు ఇవే.
(1 / 7)
శ్రీ కృష్ణ జన్మాష్టమి (కృష్ణాష్టమి) పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మదినంగా ఈరోజును జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం ఎనిమిదో రోజున ఈ పర్వదినం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి ఉంది. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే చాలా మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది.
(2 / 7)
హిందూమతంలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. శ్రీవిష్ణువు, లక్ష్మిదేవికి దీన్ని ఇష్టమైన మొక్కగా విశ్వసిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
(3 / 7)
కృష్ణాష్టమి రోజున తులసి మొక్క ముందు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని పఠించాలి. శ్రీకృష్ణుడి నామాలను జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది. (Unsplash)
(4 / 7)
కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణుడికి సమర్పించే వెన్నెలో తులసి ఆకులను వేయండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనే విశ్వాసం ఉంది.
(5 / 7)
కృష్ణాష్టమి రోజున తులసి మొక్కకు ఎర్రని వస్త్రం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి దక్కేందుకు తోడ్పడుతుందనే విశ్వాసం ఉంది.
(6 / 7)
కృష్ణ జన్మాష్టమి పండుగ రోజున తులసి మొక్క ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. 11సార్లు తులకి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.
ఇతర గ్యాలరీలు