Ashada purnima 2024: ఆషాఢ పూర్ణిమ నాడు ఈ చిన్న పరిహారం చేయండి ఆర్థిక సంక్షోభం పోతుంది
Ashada purnima 2024: పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ 21 జూలై 2024న జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ రోజున విష్ణువును పూజించడం, దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల ఆర్థిక సంక్షోభమే ఉండదు.
Ashada purnima 2024: సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు చేసే పవిత్ర నదీ స్నానం, దాన కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువును పూజించడం చేస్తారు. ఈరోజు దానం చేయడం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణిస్తారు.
పంచాంగం ప్రకారం ఆషాఢ పూర్ణిమ ఈ సంవత్సరం జూలై 21వ తేదీ ఆదివారం వచ్చింది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది. ఈ రోజును గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆషాడ మాసంలో వచ్చిన పౌర్ణమి రోజున వేద వ్యాసుడు జన్మించాడని మతపరమైన నమ్మకం. అందుకే ఈ రోజు వేదవ్యాస మహర్షి జయంతి కూడా జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంలో గురువులను పూజిస్తారు. జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడటానికి ఆషాఢ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటారు. ఆషాఢ పూర్ణిమ ఖచ్చితమైన తేదీని, సాధారణ పరిష్కారాలను తెలుసుకుందాం.
ఆషాఢ పూర్ణిమ ఖచ్చితమైన తేదీ
దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి తేదీ 20 జూలై 2024న సాయంత్రం 05:59 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జూలై 21వ తేదీ మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయతిథి నాడు ఉపవాసాలు, పండుగలు జరుపుకుంటారు. అందుకే జూలై 21న ఆషాఢ పూర్ణిమ జరుపుకుంటారు.
ఆషాఢ పూర్ణిమ నివారణలు
ఆషాఢ పూర్ణిమ రోజున పచ్చి పాలను పంచదార కలిపి రావి చెట్టుకు సమర్పించండి. పౌర్ణమి రోజున రావిచెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నివాసిస్తారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల సాధకుడిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అతని సంపద పెరుగుతుంది.
వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆషాఢ పూర్ణిమ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన 'ఓం నమో భగవతే నారాయణాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు.
ఆషాఢ పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణులను విధిగా పూజించండి. లక్ష్మీ దేవికి 11 పసుపు కౌరీలు సమర్పించండి. దానిపై పసుపుతో తిలకం వేయండి. దీని తరువాత ఈ కౌరీలను ఉదయాన్నే ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని సురక్షితంగా ఉంచండి. ఈ పరిహారంతో ఇంట్లో డబ్బు, ధాన్యాల నిల్వ ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుందని నమ్ముతారు.
వైవాహిక జీవితంలో సంతోషం కోసం ఆషాఢ పూర్ణిమ రోజున భర్త లేదా భార్య చంద్రదేవునికి నీటిని సమర్పించాలి. చంద్రోదయం వేళ అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలోని చంద్ర దోషం కూడా తొలగిపోతుంది.
ఆషాఢ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆరాధన సమయంలో వారికి పరిమళ ద్రవ్యాలు, సుగంధ ధూపాలను సమర్పించండి. ఇది లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుందని అంటారు. సంపద, ఆనందం, శ్రేయస్సును అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.