Diwali 2024: దీపావళికి ముందే ఈ మొక్కలు తెచ్చి పెట్టుకోండి- లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది-before diwali bring these 5 plants maa lakshmi will always reside in the house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2024: దీపావళికి ముందే ఈ మొక్కలు తెచ్చి పెట్టుకోండి- లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది

Diwali 2024: దీపావళికి ముందే ఈ మొక్కలు తెచ్చి పెట్టుకోండి- లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది

Gunti Soundarya HT Telugu
Oct 15, 2024 12:59 PM IST

Diwali 2024: అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ రాబోతుంది. ఈ సందర్భంగా మీరు కొన్ని మొక్కలను ఇంటికి తీసుకురావచ్చు. ఇవి మీ ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కురిపిస్తాయి.

లక్ష్మీదేవి
లక్ష్మీదేవి

కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే అతి ముఖ్యమైన, పెద్ద పండుగ దీపావళి. ఆనందం, శ్రేయస్సును ఇచ్చే దీపాల పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఈ పర్వదినాన దీపాలు వెలిగించి లక్ష్మీదేవి, వినాయకుడితో పాటు సంపదకు రాజు అయిన కుబేరుని పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సును లభిస్తాయని నమ్ముతారు.

ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పూలతో, దీపాలతో, ఇతర వస్తువులతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతారు. అయితే ఇవన్నీ కాకుండా మీరు అలంకరణ కోసం కొన్ని మొక్కలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవి మీ ఇంటికి అందమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో సానుకూలత, సంతోషం, శ్రేయస్సును కూడా ఉంచుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తాయి. దీపావళికి ముందు మీరు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన ఐదు అదృష్ట మొక్కలు ఇవే.

పీస్ లిల్లీ

ఈ మొక్కను నాటడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పేరుకు తగినట్టు ఇంట్లో శాంతికరమైన వాతావరణం ఏర్పడుతుంది. తెల్లని పువ్వులతో కూడిన ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. అది నాటిన ప్రదేశం వాతావరణాన్ని కూడా పూర్తిగా సానుకూలంగా చేస్తుంది. శాంతికి చిహ్నమైన ఈ మొక్కను ఇంట్లో నాటితే సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.

జాడే మొక్క

జడే ప్లాంట్ ను క్రాసులా అని కూడా అంటారు. కుబేరుడి మొక్క అనే పేరు కూడా ఉంది. మందంగా చిన్నపాటి ఆకులు కలిగి ఉండే ఈ మొక్క చూసేందుకు కూడా చాలా ముద్దుగా ఉంటుంది. తెలుపు లేదా గులాబీ పువ్వులతో ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా అదృష్ట మొక్క. ఈ మొక్కను ఎక్కడ నాటితే అక్కడ సానుకూలత ఉంటుంది. ఈ మొక్కలో లక్ష్మి దేవి నివసిస్తుంది. ఈ మొక్క నాటిన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

తెల్ల పలాష్

తెల్లటి పువ్వులతో తెల్లటి పలాష్ మొక్క ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది మతపరమైన, ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ మొక్కలో లక్ష్మీదేవి, త్రిమూర్తులు నివసిస్తారని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఈ మొక్కను ఎక్కడ నాటితే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అయితే ఎవరైనా తన ఇంట్లో మనీ ప్లాంట్ లేకుంటే ఈ దీపావళికి తమ ఇంట్లో తప్పకుండా నాటాలి. ఇది నాటేందుకు ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఈ మొక్క గాలిలోని మలినాలను కూడా తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

వెదురు మొక్క

వెదురు మొక్క పర్యావరణానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే పాజిటివ్ ఎనర్జీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్. అందువల్ల ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner