తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Meedu Kattadam: మీదు కట్టడం అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? ఈ ఆచారం పాటిస్తే కలిగే ఫలితం ఏంటి?

Meedu kattadam: మీదు కట్టడం అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? ఈ ఆచారం పాటిస్తే కలిగే ఫలితం ఏంటి?

HT Telugu Desk HT Telugu

25 February 2024, 15:00 IST

google News
    • Meedu kattadam: ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పాటించే ఆచారం మీదు కట్టడం. అసలు ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు? ఎలా పాటిస్తారు. ఈ ఆచారం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చిలకమర్తి తెలియజేశారు. 
మీదు కట్టడం అంటే ఏంటి?
మీదు కట్టడం అంటే ఏంటి? (pixabay)

మీదు కట్టడం అంటే ఏంటి?

ధర్మబద్ధమైన ఏ కార్యక్రమం ఆచరించినప్పుడు అయినా ఆ కార్యక్రమంలో దిష్టి దోషం వల్ల కావచ్చు, మరి ఏ ఇతర దోషము వలనైనా కావచ్చు ఆటంకములు కలుగు అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Dec 21, 2024, 11:48 PM

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

ఇలా ధర్మబద్ధంగా ఆచరించే చేసే పనులు వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశం వంటి శుభకార్యాలయందు కావచ్చు, యజ్ఞ యాగాది క్రతువులయందు కావచ్చు, దిష్టిదోషము, ఇతర దోషాల వలన కలిగేటటువంటి విఘ్నాలు, ఇబ్బందులు తొలగి ఆ కార్యక్రమాలు విజయాన్ని, సత్ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరునికి మీదు కట్టి ఆ కార్యక్రమాలు ఆచరించినట్లయితే అవి దిగ్విజయంగా పూర్తవుతాయని శాస్త్రీయంగా ఉన్నటువంటి ఆచారమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మీదు కట్టడం ఎలా?

ముందుగా గృహంలోని సింహ ద్వారానికి మామిడి తోరణం కట్టాలి. బియ్యం పిండితో నేలపై పద్మం ఆకారంలో ముగ్గు వేసి, దానిపై పసుపు, కుంకుమలతో అలంకారం చేసి దానిపై క్రొత్త వస్త్రమును (పసుపుతో తడిపినది) వేసి దానిపై కేజింపావు బియ్యం పోసి, జత తమలపాకులు ఉంచి దానిపై పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని ఉంచి గణపతికి షోడశోపచారములతో పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పూజచేయవలెను.

తరువాత తిరగలికి పసుసు రాసి కుంకుమ బొట్టు పెట్టి తిరగలి పిడికి తోరణము కట్టి, ఒక ముత్తైదువుచే తిరగలిలో 5 గుప్పెళ్ళు శెనగలు పోసి విసరవలెను. ఈవిధంగా ఐదురుగు ముత్తైదువులతో చేయించాలి. 

తర్వాత గణపతిని ఒక చిన్న పెట్టెతో ఉంచి బియ్యం, విసిరిన శెనగలు ఈ క్రొత్త టవలులో ఉంచి మూటకట్టి దేవుని గదిలో భద్రపరచాలి. 16 రోజుల పండుగ రోజు లేదంటే ఆ లోపుగానీ ఆ మూటను తీసి శెనగపప్పు బియ్యముతో ఉండ్రాళ్ళు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి తరువాత అందరికి పంచి పెట్టాలి. 

ఆచారాన్ని బట్టి మినప వడియాలుకూడా పెడతారు. దీనినే మీదుకట్టే విధానం అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం