Mango leaves: పూజా కార్యక్రమాల్లో మామిడి ఆకులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
Mango leaves: ఎటువంటి శుభకార్యం అయినా సరే తప్పనిసరిగా మామిడి ఆకులు ఉపయోగిస్తారు. వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే..
Mango leaves: హిందువులు ప్రతి శుభకార్యంలో మామిడి ఆకులు ఉపయోగిస్తారు. మామిడి ఆకులతో చేసిన తోరణం ఇంటి గుమ్మానికి అందంగా అలంకరిస్తారు. హిందూ, ఆచారాలు, వేడుకల్లో మామిడి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుపచ్చని ఆకులు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని కూడా కలిగి ఉన్నాయి.
మామిడి ఆకులు శ్రేయస్సు, సంతానోత్పత్తి, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తాయి. పూజ కార్యక్రమంలో పెట్టె కలశం దగ్గర మామిడి ఆకులు ఉంచుతారు. ఇవి దేవతల అవయవాలని సూచిస్తాయి. నీటి కుండపై ఉన్న కొబ్బరి కాయ దైవిక తలకి సూచిస్తుంది. మామిడి ఆకులు లక్ష్మీదేవి చిహ్నంగా కూడా భావిస్తారు. ఇవి పెట్టడం వల్ల శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాయని చెప్తారు.
భక్తులకి మురుగన్ సందేశం
హిందూ ఆచారం ప్రకారం వినాయకుడు, మురుగున్ కి మామిడి ఆకులకు ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రేయస్సు, సంతానోత్పత్తి కోసం వేడుకల సమయంలో మామిడి ఆకులకు ఇంటికి కట్టుకోమని మురుగన్ భక్తులని సందేశం ఇచ్చాడని చెబుతుంటారు.
సంతానోత్పత్తికి చిహ్నం
మామిడి ఆకులు హిందూ గ్రంథాలైన రామాయణం, మహాభారతాలలో సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. అది మాత్రమే కాదు మామిడి ఆకులు ప్రేమ దేవుడైన మన్మథుడుతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. పురాణాల ప్రకారం మన్మథుడు కోరికలని రేకెత్తించడానికి మామిడి చెక్కతో చేసిన విల్లుని ఉపయోగించినట్టు కూడా కథలు చెబుతాయి.
మామిడి తోరణాలు
మామిడి ఆకుల్ని తలుపులు, కిటికీలకి వేలాడదీసే సంప్రదాయం మన ఇళ్ళలో చాలా వరకు ఉంటుంది. ఇవి ఇంటికి తోరణంగా కట్టడం వల్ల ప్రతికూల శక్తుల్ని నిరోధిస్తుంది. నెగటివ్ ఎనర్జీ నుంచి ఇంటిని రక్షించేందుకు అవరోధాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. ఇవి సానుకూల శక్తులని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉంటే తొలగిపోతాయి. దేవతల అనుగ్రహం పొందుతారు.
ఆరోగ్యం కూడ
మామిడి ఆకులు మతపరంగా మాత్రమే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. మామిడి ఆకులు గాలిలో ఆక్సిజన్ ని పెంచుతాయి. కార్బన్ డయాక్సైడ్ ని తొలగిస్తాయి. గాలిని నాణ్యతని మెరుగుపరుస్తుంది. పర్యావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి.
బౌద్ధమతంలో
బౌద్ధమతంలో మామిడి పండ్లు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇవి జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఒక కథ ప్రకారం సన్యాసి బుద్ధునికి పండిన మామిడి పండుని సమర్పించాడు. ఇవి సంతానోత్పత్తిని పెంపొందించేందుకు సహాయపడతాయని నమ్ముతారు. బౌద్ధ బోధనలలో మామిడి ప్రాముఖ్యత గురించి గొప్పగా చెప్తారు. ఇవి సమృద్ది, ఆధ్యాత్మిక మేలుకొలుపుకి శక్తివంతమైన చిహ్నంగా భావిస్తారు.
మామిడి ఆకులు కట్టడం వెనుక మరొక కూడా చెప్తారు. శివ పార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కింద జరిగిందని అందుకే శుభ కార్యాలలో మామిడి ఆకులని ఉపయోగిస్తారని చెబుతారు.