Dhanurmasam: కళ్యాణప్రాప్తి కలగాలంటే ధనుర్మాసంలో ఏం చేయాలి? ఈ నెల విశిష్టత, మహా విష్ణువుని ఇలా ఆరాధిస్తే తిరుగే ఉండదు
18 December 2024, 11:20 IST
- Dhanurmasam: సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అని అంటారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలైంది. సంక్రాంతి నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. కనుక ఆ ముందు రోజు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది.
Dhanurmasam: కళ్యాణప్రాప్తి కలగాలంటే ధనుర్మాసంలో ఏం చేయాలి?
ధనుర్మాసంలో మనం పాటించే పద్ధతులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. ధనుర్మాసం చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. దీనికి ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం ఏర్పడుతుంది. ఇది ఎంతో విశిష్టమైనది. చాలా మందికి ధనుర్మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకంటారు?, ధనుర్మాసంలో ఏం చేయొచ్చు?, ఏం చేయకూడదు?, ధనుర్మాసం విశిష్టత ఏంటి? ధనుర్మాసంలో ముగ్గులకి ఎందుకు అంత ప్రత్యేకత.. ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో ఉండే సందేహాలు. వాటికి సంబంధించిన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
అసలు ధనుర్మాసం అంటే ఏంటి?
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అని అంటారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలైంది. సంక్రాంతి నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. కనుక ఆ ముందు రోజు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసంలో దీపారాధన చేస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ధనుర్మాసాన్ని పండుగ నెల అని అంటారు.
ఎందుకు ధనుర్మాసానికి ఇంత విశిష్టత ఉంది?
ధనుర్మాసంలో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనంతో పాటుగా గోదా కళ్యాణం వంటివి చేస్తారు. దివ్య ప్రార్థనకు అనువైన నెల. ధనుర్మాసంలో చేసే పూజతో ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు. ధనుర్మాసం ఉదయం, సాయంత్రం కూడా దీపారాధన చేయడం మంచిది. అలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దరిద్రం నుంచి బయటపడచ్చని చాలా మంది హిందువులు నమ్ముతారు.
ధనుర్మాసంలో ఎందుకు ఇలా ముగ్గులు వేస్తారు?
ధనుర్మాసం సమయంలో ప్రత్యేకమైన ముగ్గులని ఇంటి ముందు వేస్తారు. నెలగంట ముగ్గులు అందంగా పెట్టి గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు కూడా ముగ్గులు పై పెడతారు. లక్ష్మీ రూపమైన గొబ్బెమ్మలని ఆరాధించడం వలన మంచి జరుగుతుందని ఇలా చేయడం జరుగుతుంది.
పెళ్లి కానీ స్త్రీలు మాత్రమే ధనుర్మాసంలో పూజలు చేయాలా?
చాలామంది పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయిలు ధనుర్మాసంలో పూజలు చేస్తారు. కానీ పెళ్లి కానీ అబ్బాయిలు కూడా ధనుర్మాసంలో పూజలు చేయొచ్చు. అప్పుడు మంచి జీవిత భాగస్వామి వారి జీవితంలోకి వస్తారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసే పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించాలి. ఆ తర్వాత తులసి దళాలతో, పూలతో, అష్టోత్తరం చదువుకుని పూజ చేయాలి. చివరగా నైవేద్యాన్ని సమర్పించాలి. నెల రోజులు ఇలా చేస్తే మంచిది. ఒకవేళ అలా చేయలేకపోతే 15 రోజులు కానీ 8 రోజులు కానీ చేయవచ్చు. ఇలా ధనుర్మాసంలో పూజలు చేయడం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది.
ఎందుకు శుభకార్యాలు చేయకూడదు?
ధనుర్మాసంలో శుభకార్యాలు చేయరు. అందుకే ఈ మాసాన్ని శూన్య మాసమని అంటారు. ధనస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతి ఉంటే ఏ శుభకార్యాన్ని కూడా చేయకూడదు. ధనుర్మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలను చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తిని రోజూ ఆరాధిస్తూ ఉంటారు.
వైకుంఠ ఏకాదశి
ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మహావిష్ణువుని ఆరాధించాలి. స్వామివారికి తులసిమాలను వేస్తారు. తులసి కోట వద్ద సాయంత్రం స్త్రీలు పూజలు చేస్తారు. ఈసారి వైకుంఠ ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజు భక్తి శ్రద్దలతో మహా విష్ణువుని ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.