Luckiest Zodiac signs: సూర్యుడు, బృహస్పతిల సంసప్తక యోగం.. ఈ ఐదు రాశలు వారికి డబ్బుతో పాటు సంతోషం!
Luckiest Zodiac signs: గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా కొన్ని సార్లు అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఇవి నిర్ధిష్ట రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం డిసెంబర్ 12న సూర్యుడు, గురు గ్రహాల మార్పుతో సంసప్తక యోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది.
గ్రహాల కదలికల్లో మార్పు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాల అరుదైన కలయిక వివిధ యోగాలను తెచ్చిపెడుతుంది. వీటినే జ్యోతిష్య భాషలో రాజయోగాలు అంటారు. డిసెంబర్ 12, 2024లో గ్రహాల కదలికల కారణంగా అరుదైన, శుభకరమైన సంఘటన చోటు చేసుకుంది. సూర్యుడి, బృహస్పతి గ్రహాల మధ్య సంసప్తక యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు వాటి స్థానాల్లో 180 డిగ్రీల కోణంలో ఒకదానికి ఒకటి ఎదురుగా నిలబడ్డాయి. ఇది అరుదైన, శక్తివంతమైన కలయికగా మారింది. దీన్నే సంసప్తక యోగంగా పిలుస్తారు. ఈ యోగం కారణంగా నిర్ధిష్ట రాశిచక్ర గుర్తులకు శ్రేయస్సు, ఆర్థిక వృద్ధితో పాటు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
సూర్యుడు, బృహస్పతి సంసపక్త యోగం అంటే ఏంటి?
గ్రహాల అధిపతి సూర్యుడికి జ్ఞానం, శ్రేయస్సు, పెరుగుదలకు కారణమైన బృహస్పతి గ్రహం నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు ఏర్పడేదే గురు, సూర్యుల సంసపక్తక యోగం. ఇది శక్తి, తేజస్సు, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈరెండు గ్రహాల అరుదైన అమరిక సామరస్య ప్రవాహాన్ని సృష్టిస్తుంది. కొన్ని రాశుల వారికి ఈ యోగం అదృష్టాన్ని, విజయాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి మంచి అవకాశాలను తీసుకొస్తుంది.
సూర్యుడు, గురుల సంసపక్త యోగం ఏ రాశుల వారికి కలిసొస్తుంది?
మిథున రాశి:
సూర్యుడు, గురు గ్రహాల సంసప్తక యోగం మిధున రాశి వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలను, మేథో వృద్ధిని పెంచుతుంది. ముఖ్యంగా మీడియా, విద్య, వ్యాపార రంగాల్లోని వారికి కెరీర్ పురోగతికి మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. కుటుంబంలో సంబంధాలు మరింత బలపడతాయి.
సింహ రాశి:
సూర్యుడు, బృహస్పతిల అరుదైన కలయిక సింహ రాశి వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సూర్యుడు సింహరాశిని పాలించే గ్రహం కనుక ఈ సమయంలో వీరికి వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయం , గుర్తింపు లభిస్తాయి. లీడర్‌షిప్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. సవాళ్లను సులభంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగుపడుతుంది. కృషికి తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న పనులు ఇప్పుడు నెరవేరతాయి.
తులా రాశి:
సూర్యుడు, గురుల సంసప్తక యోగం తులారాశి వ్యక్తుల జీవితంలో గణనీయమైన వృద్ధిని తెస్తుంది. ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రణాలికను ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు సానుకూల రాబడిని అందిస్తాయి. సంబంధాలలో సామరస్యం, శాంతి, సంతృప్తి కలుగుతాయి.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వ్యక్తులకు సూర్యుడు, గురు గ్రహాల సంసప్తక యోగం ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ యోగం వీరి కెరీర్ కు సంబంధించిన లక్ష్యాలలో స్పష్టతను తెస్తుంది. వృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు, వ్యక్తిగత జీవితం మరింత సంతృప్తికరంగా మారుతుంది. స్వీయ అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రణాలికలపై దృష్టి పెట్టడానికి ఇది గొప్ప సమయం.
కుంభ రాశి:
సంసపక్త యోగం సమయంలో కుంభ రాశి వారిలో సృజనాత్మక శక్తి, విన్నూత్న ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడానికి, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించడానికి ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా భాగస్వామ్యాలు లేదా సహకారాల ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయి. మానసిక, శారీరక సంతృప్తి కలుగుతుంది.