తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం - వేడుకగా 'స్వర్ణరథోత్సవం'
- Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

(2 / 6)
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
(3 / 6)
సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు.
(4 / 6)
స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. తిరువీధులన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
(5 / 6)
ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో తీరుమల వీధులు మార్మోగాయి.
ఇతర గ్యాలరీలు