Hair Cut Auspicious days: హెయిర్ కట్టింగ్‌కు ఏ రోజు మంచిది? ఎలాంటి నియమాలను పాటించాలి? ఇలా చేస్తే మాత్రం ఆర్థిక లాభాలు
18 December 2024, 8:07 IST
- Hair Cut Auspicious days: ప్రతి రోజు కూడా ఒక్కో రకమైన పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. అయితే, చాలా మంది పెద్దవాళ్ళు ఈరోజు జుట్టు కట్ చేసుకోకూడదు అని చెప్పడం మీరు వినే ఉంటారు. ఎప్పుడు జుట్టు కట్ చేసుకుంటే మంచిది, జుట్టును కత్తిరించుకోవడానికి మంచి రోజులు ఏవి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Cut Auspicious days: హెయిర్ కట్టింగ్‌కు ఏ రోజు మంచిది?
హిందువులు అనేక ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఏడు రోజులకి కూడా ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి రోజు కూడా ఒక్కో రకమైన పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. అయితే, చాలా మంది పెద్దవాళ్ళు ఈరోజు జుట్టు కట్ చేసుకోకూడదు, ఈరోజు జుట్టు కట్ చేసుకోవడం మంచిది కాదు అని చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే, నిజానికి ఎప్పుడు జుట్టు కట్ చేసుకుంటే మంచిది, జుట్టును కత్తిరించుకోవడానికి మంచి రోజులు ఏవి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం, మన హిందూ ధర్మంలో అనేక ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా వాటిని మనం పాటిస్తున్నాము. అలాగే జుట్టు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని పద్ధతుల్ని మనం పాటిస్తున్నాము.
లేటెస్ట్ ఫోటోలు
ఏ రోజు జుట్టు కత్తిరించుకుంటే మంచిది?
జుట్టు కత్తిరించుకోవడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం మంచిది. మంగళవారం, శనివారం, ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోకూడదు. ఇదే కాకుండా అమావాస్య, పౌర్ణిమ రోజుల్లో కూడా జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా జుట్టును కత్తిరించుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన ఆ వ్యక్తిపై ప్రభావం పడుతుంది. ఆరోగ్యం, ధనం, సామర్థ్యం పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
సోమవారం, బుధవారం, శుక్రవారం నాడు జుట్టు కత్తిరించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
ఈ మూడు రోజులు జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజులు. అయితే ఇలా ఈ మూడు రోజులని జుట్టు కత్తిరించుకున్నట్లయితే పలు ప్రయోజనాలను పొందవచ్చు. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ప్రశాంతత, ఆరోగ్యం:
సోమవారం చంద్రుని రోజు. మానసిక ప్రశాంతతని పొందవచ్చు. ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
ఆర్థిక ప్రయోజనాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్:
బుధవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. నిర్ణయం తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. బుధవారం గణేశుడు రోజు. ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం వలన దృఢంగా ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యలు ఎప్పుడు కూడా ఉండవు.
వైవాహిక జీవితం బాగుంటుంది:
శుక్రవారం నాడు జుట్టు కదిరించుకోవడం వలన వైవాహిక జీవితం బాగుంటుంది. సంతోషంగా భార్యాభర్తలు గడపొచ్చు. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.