తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం వీరికి వాక్చాతుర్యం వరం, వ్యాపారాలలో దూసుకెళ్తారు

వారఫలాలు.. ఈ వారం వీరికి వాక్చాతుర్యం వరం, వ్యాపారాలలో దూసుకెళ్తారు

HT Telugu Desk HT Telugu

21 July 2024, 2:00 IST

google News
  • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జులై 21వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు జులై 21 నుంచి 27వ తేదీ వరకు
వారఫలాలు జులై 21 నుంచి 27వ తేదీ వరకు

వారఫలాలు జులై 21 నుంచి 27వ తేదీ వరకు

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 21.07.2024 నుంచి 27.07.2024

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది- ధన లాభంతో ఆర్థిక కష్టాలు దూరం..

Dec 15, 2024, 05:33 AM

Purnima Effects: నేడే ఈ ఏడాదిలో చివరి పౌర్ణమి, ఈ రాశుల వారికి లెక్కలేనన్ని శుభాలు కలగడం ఖాయం

Dec 15, 2024, 05:00 AM

రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!

Dec 14, 2024, 07:35 PM

Love Zodiac signs: ఈ రాశులు వారు ఎవరినైనా ప్రేమలో పడేస్తారు.. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు

Dec 14, 2024, 09:13 AM

Dreams Come True: మీ కలలు నిజమవ్వడానికి మీకు సహాయపడే నాలుగు రాశి చిహ్నాలు

Dec 14, 2024, 08:19 AM

Love Rasis: ఈ రాశుల్లో జన్మించినవారు ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తారు

Dec 14, 2024, 06:00 AM

మాసం : ఆషాఢ‌ము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

నూత‌న‌ పనులకు శ్రీకారం చుడ‌తారు. అనుకున్న ప‌నుల‌ను వేగంగా పూర్తి చేస్తారు. ఆశించిన రాబడి ల‌భిస్తుంది. ఆత్మీయుల‌తో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషదాయకంగా గడుస్తుంది. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉండొచ్చు. ఆరోగ్యం ప‌ట్ల కాస్త జాగ్ర‌త్త అవ‌స‌రం. నలుపు, లేత గులాబీ రంగులు క‌లిసి వ‌స్తాయి. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి

ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఊహించని కొన్నిసంఘటనలు ఎదుర‌వుతాయి. వివాహ,ఉద్యోగ ప్ర‌య‌త్నాలు కలసివస్తాయి. వాహనయోగం ఉంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు శుభ‌దాయ‌కం. గణేశాష్టకం పఠించండి.

మిథున రాశి

వారఫలాల ప్రకారం ఈ వారం మిథున రాశి వాళ్ళు ఆర్థికంగా మరింత బలపడతారు. రుణగ్రస్తుల బాధలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో సానుకూలంగా ఉండ‌నుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం ఉండొచ్చు. ధనవ్యయం ఎక్కువ‌గా ఉంది. ఎరుపు, బంగారు రంగులు ధ‌రించండి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

ముఖ్యమైన పనులలో జాప్యం చేయొద్దు. ఆర్థిక పరిస్థితి మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలీకృత‌మ‌వుతాయి. తీర్థయాత్రల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు . వాక్చాతుర్యం మీకు వరంగా మారనుంది. వ్యాపార లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ద‌క్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండనున్నాయి. వివాదాల‌కు కాస్త దూరంగా ఉండండి. ఎరుపు, గులాబీ రంగులు క‌లిసి వ‌స్తాయి. శివాష్టకం పఠించండి.

సింహ రాశి

చేప‌ట్టిన ప‌నుల్లో చిన్న‌పాటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌చ్చు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు త‌లెత్తె అవ‌కాం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాల కోసం ఎదురుచూస్తారు. విద్య. ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఉద్యోగులకు విధులు గందరగోళంగా ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు ధ‌రించండి. దుర్గాదేవిని స్మరించండి.

కన్యా రాశి

ఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహిస్తూ అప్పులు లేకుండా గడిపేస్తారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలను వేగవంతంగా చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పట్టుదలతో నిర్వహించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. మానసిక అశాంతి ఉండొచ్చు. తెలుపు, ఆకుపచ్చ రంగులపై మ‌క్కువ చూపండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

తులా రాశి

కీల‌క ప‌నులు పూర్తి చేయడంలో సఫలీకృతుల‌వుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు ఉండొచ్చు. గులాబీ, తెలుపు రంగులు శుభ‌దాయ‌కం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

అనుకున్న వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం ఉంది. కుటుంబంలో వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు ఉండొచ్చు. ఎరుపు, నేరేడు రంగులు క‌లిసి వ‌స్తాయి. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు రాశి

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీర‌తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు రావచ్చు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉండొచ్చు. ఆకుపచ్చ. నేరేడు రంగులు ధ‌రించండి. దేవీస్తోత్రాలు పఠించండి.

మకర రాశి

అంత‌టా మీదే పైచేయిగా నిలుస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు శుభ ఫ‌లితాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో చికాకులున్నాయి. ధనవ్యయం ఎక్కువ‌గా ఉంది. గులాబీ, లేత పసుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభ రాశి

కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాదాల‌ను నేర్పుతో పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. అనుకోని ఖర్చులున్నాయి. ఎరుపు, నేరేడు రంగులు ధ‌రించండి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీన రాశి

వారఫలాల ప్రకారం ఈ వారం మీన రాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయులు చేరువ‌వుతారు. ఆప్తులు ప్ర‌శాంతంగా గ‌డుపుతారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో దూసుకువెళతారు. ఉద్యోగులకు కీలక సందేశం అందవ‌చ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు ఉండొచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులు ధ‌రించండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం