Ayurvedam: పసుపు, అల్లం పొడి కలిపి తీసుకొని చూడండి ఆయుర్వేదం ప్రకారం కీళ్ల నొప్పులు మాయం-take turmeric and ginger powder together and see if it cures joint pains according to ayurveda ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedam: పసుపు, అల్లం పొడి కలిపి తీసుకొని చూడండి ఆయుర్వేదం ప్రకారం కీళ్ల నొప్పులు మాయం

Ayurvedam: పసుపు, అల్లం పొడి కలిపి తీసుకొని చూడండి ఆయుర్వేదం ప్రకారం కీళ్ల నొప్పులు మాయం

Haritha Chappa HT Telugu
Jun 01, 2024 09:00 AM IST

Ayurvedam: ఆయుర్వేదంలో పసుపుకు, అల్లం పొడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మన శరీరంలో ఉన్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.

ఆయుర్వేదం టిప్స్
ఆయుర్వేదం టిప్స్ (Pixabay)

Ayurvedam: కొన్ని యుగాల నుండి పసుపును, అల్లాన్ని మన వంటల్లో భాగం చేసాము. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన వంట పదార్థాలుగా మారాయి. ఇవి కూర రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో ఈ రెండింటికీ ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయ వైద్యంలో ఈ రెండింటినీ అధికంగా వినియోగిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం కోసం పసుపు, అల్లం పొడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి.

మన జీవక్రియ, రోగనిరోధక శక్తి పెంచడానికి పసుపు, అల్లం చాలా ముఖ్యమైనవి. వీటిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇక అల్లంలో జింజరాల్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ తో పాటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే పసుపు, అల్లం ఈ రెండింటిలో విటమిన్ సి, విటమిన్ b6, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఈ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. గుండె ఆరోగ్యానికి, మెదుడు పనితీరుకు ఈ రెండు ఎంతో సహకరిస్తాయి.

పసుపును, అల్లం పొడిని కలిపి ఎలా తీసుకోవాలంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు అల్లం పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. అల్లం పొడి లేకపోతే అల్లం తురుమును వేసుకోవచ్చు. లేదా అల్లం రసాన్ని కలుపుకున్నా చాలు.

అల్లంలో జీర్ణం ఎంజైములు ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పసుపు, అల్లం ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

శరీరంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు అధికంగా ఉంటే ఈ రెండు కలిపి పాలల్లో వేసుకుని తాగండి. మీకు ఉపశమనం దక్కుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువవుతాయి. వాటిని తగ్గించడంలో అల్లం, పసుపు మిశ్రమం ముందుంటుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి పసుపు, అల్లం మిశ్రమం ఎంతో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం మెదడును కాపాడుతుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. రోజువారీ ఆహారంలో పసుపును జోడించుకోవడం చాలా అవసరం.

పసుపు, అల్లం పొడిని స్మూతీలలో కూడా కలుపుకుని తినవచ్చు. లేదా గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని తాగవచ్చు. కూరల్లో, వేపుళ్ళలో కూడా వేసుకొని తినవచ్చు. టీ చేసుకునేటప్పుడు తాజా అల్లం ముక్కలను వేసి పసుపు పొడిని వేసి బాగా మరిగించి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవసరమైతే అందులో తేనె కలుపుకొని తాగవచ్చు. ఎలా అయినా అల్లం పసుపు కలిపిన మిశ్రమం శరీరంలోకి వెళ్లడం చాలా అవసరం.