Shlokalu: ఈ శ్లోకాలు పిల్లలకు తప్పకుండా నేర్పించండి.. వారికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్టే-every parent must teach these powerful shlokas to your kids for bright future ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shlokalu: ఈ శ్లోకాలు పిల్లలకు తప్పకుండా నేర్పించండి.. వారికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్టే

Shlokalu: ఈ శ్లోకాలు పిల్లలకు తప్పకుండా నేర్పించండి.. వారికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్టే

Gunti Soundarya HT Telugu
Jul 11, 2024 12:02 PM IST

Shlokalu: తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా కొన్ని శ్లోకాలు నేర్పించాలి. వీటిని నిత్యం పఠించడం వల్ల మానసికంగా ఎదుగుతారు. దైవ భయంతో పాటు సమస్యలు ఎదుర్కొనే శక్తి వారికి వస్తుంది.

ఈ శ్లోకాలు పిల్లలు తప్పకుండా నేర్చుకోవాలి
ఈ శ్లోకాలు పిల్లలు తప్పకుండా నేర్చుకోవాలి (pinterest)

Shlokalu: పిల్లలకు చిన్నతనం నుంచే దేవుడు అంటే భయం, భక్తి ఉండే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలి. అప్పుడే దైవంతో కనెక్ట్ అవగలుగుతారు. శ్లోకాలు, స్తోత్రాలు నేర్పించడం వల్ల ఎటువంటి కష్టం వచ్చినా పెద్దయిన తర్వాత ఎదుర్కోగలుగుతారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి శ్లోకాలు, మంత్రాలు క్రమం తప్పకుండా చదువుకోవడం చాలా మంచిది.

ఈ చిన్న చిన్న శ్లోకాలు మీ చిన్నారులకు నేర్పించడం వల్ల బలమైన మానసిక ఆరోగ్యం పొందుతారు. శక్తివంతంగా తయారవుతాయి. వారిలో ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు తప్పకుండా బోధించాల్సిన శ్లోకాలు ఇవి.

గాయత్రీ మంత్రం

ఓం భూర్ భువః స్వాహా, తత్సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోద్యాత్

ఎంతో శక్తివంతమైన గాయత్రీ మంత్రం ఇది. ఇది శక్తివంతమైన సూర్య భగవానుడి మంత్రం. ఇది పిల్లలు నేర్చుకోవడం వల్ల జ్ఞానం పెంపొందుతుంది. మేధస్సు, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఓంకారంతో ప్రారంభమయ్యే ఈ శ్లోకం వారి చుట్టూ వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది. రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

గురు మంత్రం

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరయ్, గురు సాక్షాత్ పరమం బ్రహ్మ, తస్మయి శ్రీ గురవే నమః

చిన్నతనం నుంచే పెద్దలను, గురువులను గౌరవించమని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఈ గురు మంత్రం ఉపాధ్యాయులు, మార్గదర్శకులు ఎంత ముఖ్యమో పిల్లలకు తెలియజేస్తుంది. పిల్లలను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకే ఉంటుంది. అందుకే వారిని దైవంతో సమానంగా భావించమని బోధిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం వజాయామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుకమివ బంధనన్, మృత్యో ముక్షీయ మమృతాత్

సర్వశక్తివంతమైన మహా మృత్యుంజయ మంత్రం శివుడికి చేసే ప్రార్థన. ఆరోగ్యం, దీర్ఘాయువు, మరణం, మరణ భయం నుంచి విముక్తి కోరుకుంటూ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తారు. ఇది పిల్లలకు నేర్పించడం వల్ల వారికి ఎలాంటి భయాలు ఉండవు. అంకితభావంతో, స్వచ్చమైన హృదయంతో జపించడం వల్ల గాయాలను నయం చేయడంతో సహాయపడుతుంది. బలాన్ని ఇస్తుంది. ప్రతికూలతలు తొలగిస్తుంది.

సరస్వతి మంత్రం

యా దేవి సర్వభూతేషు, విద్యా రూపేన్ సమస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమో న్మమః

చదువుల తల్లి సరస్వతి దేవికి అంకితం చేసిన మంత్రం ఇది. ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది. సరస్వతీ మంత్రం పిల్లల్లో మేధస్సును పెంచుతుంది. ఈ మంత్రం పఠించడం వల్ల పిల్లలకు సరస్వతీ దేవి ఆశీర్వాదాలు లభిస్తాయి.

మహా లక్ష్మీ మంత్రం

నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే, శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మి నమోస్తుతే

సంపద, విజయాన్ని ఇచ్చేది ఈ మహాలక్ష్మీ మంత్రం. పిల్లలు వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయవంతం కావడానికి దేవతతో లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడంలో సహాయపడుతుంది. ఈ శ్లోకం పిల్లలకు ఆర్థిక సమృద్ధి , శ్రేయస్సును ఇస్తుంది.

గణేష మంత్రం

వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సంప్రభ, నిర్విఘ్రం కురు మే దేవ, సర్వ కార్యేషు సర్వదా

తమకు అన్ని పనుల్లో సహాయపడమని, అడ్డంకులు తొలగించమని వినాయకుడిని వేడుకుంటూ ఈ మంత్రం జపిస్తారు. పిల్లలకు ఈ మంత్రం తప్పనిసరిగా నేర్పించాలి. తమ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు అధిగమించేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది.

హరే కృష్ణ మంత్రం

హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ , హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే

రోజులో ఏ సమయంలోనైనా జపించగలిగే సరళమైన మంత్రం ఇది. చాలా శక్తివంతమైనది. విష్ణువు, శ్రీకృష్ణుడు, రాముడికి సంబంధించిన దైవిక శక్తులను ప్రేరేపిస్తుంది. పిల్లలకు ఆధ్యాత్మిక పెరుగుదల కలిగించడంలో సహాయపడుతుంది.

రుద్ర మంత్రం

ఓం నమో భగవతే రుద్రయే

ఓం అనే శ్లోకంతో ప్రారంభమయ్యే ఈ శక్తివంతమైన మంత్రం శివుడికి అంకితం చేసింది. రుద్ర భగవానుడి ఆశీస్సులు పొందేందుకు పిల్లలు తప్పనిసరిగా జపించాలి. సంకల్పం, దయ, బలం కలిగి ఉండేందుకు సహాయపడుతుంది. వారి చుట్టూ దాగి ఉన్న చెడు శక్తుల నుంచి వారిని కాపాడుతుంది.