తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vastu Tips For Staircase Know Dos And Donts For Health Wellbeing

Vastu Tips for staircase: మెట్ల కింద అవి పెడుతున్నారా? ఆర్థిక చిక్కులు తప్పవు

HT Telugu Desk HT Telugu

12 May 2023, 11:24 IST

    • Vastu Tips for staircase: కొన్ని వస్తువులను మెట్ల కింద ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. అన్ని వేళలా ఆర్థిక ఇక్కట్లు వచ్చి పడతాయి.
మెట్ల నిర్మాణానికి సంబంధించిన వాస్తు టిప్స్
మెట్ల నిర్మాణానికి సంబంధించిన వాస్తు టిప్స్

మెట్ల నిర్మాణానికి సంబంధించిన వాస్తు టిప్స్

Vastu Tips for staircase: మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని ఏది పడితే అది వాటి కింద పడేస్తుంటాం. ఓ చిన్నపాటి స్టోర్ రూమ్‌లా దానిని వాడేస్తుంటాం. లేదంటే మరుగు దొడ్లు కట్టేస్తుంటాం. దాని వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి చిన్న వస్తువు లేదా ప్రతి మూల ఆ నివాసంలోని వ్యక్తుల ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులపై శుభ, అశుభ ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్థలం లేకపోవడంతో తరచూ మెట్ల కింద ఏదో ఒకటి స్టోర్ చేస్తుంటారు. ఈ పొరపాటు వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

Jupiter Venus conjunction: గురు శుక్ర సంయోగం.. గజలక్ష్మీ రాజయోగంతో వీళ్ళు విజయ శిఖరాలు చేరుకుంటారు

Apr 26, 2024, 03:28 PM

ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! భారీ ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​..

Apr 26, 2024, 05:56 AM

Ruchak Raja Yogam: రుచక్ రాజ యోగం.. 3 రాశుల వారిని అదృష్టం వరించనుంది

Apr 25, 2024, 02:21 PM

Angaraka yogam: అంగారక యోగం.. మే 31 వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే, ప్రమాదాలు ఎదురుకావచ్చు

Apr 24, 2024, 02:27 PM

ఏప్రిల్ 24, రేపటి రాశి ఫలాలు.. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్, సంతానం కలిగే అవకాశం

Apr 23, 2024, 08:38 PM

ఇల్లు నిర్మించేటప్పుడు మెట్లు సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. తప్పుడు దిశలో మెట్లు నిర్మిస్తే ఆర్థికంగా నష్టపోవడంతో కుటుంబంలో టెన్షన్ పెరుగుతుంది.

మెట్లకు సంబంధించిన వాస్తు నియమాలు

  1. మెట్ట కింద మరుగు దొడ్లు, వంట గదులు, పూజ గదులు, స్టడీ రూమ్స్, షాప్స్ నిర్మించకూడదు. ఇలా చేస్తే వాస్తు దోషం కారణంగా ఎల్లవేళలా సమస్యలే చుట్టుముడుతాయి. జీవితంలో ఒత్తిడి, విభేదాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ ప్రతిష్టను కోల్పోవాల్సి వస్తుంది.
  2. భవనం మెట్లు ఎల్లప్పుడూ దక్షిణం లేదా పడమర దిశలో ఉండాలి.
  3. మెట్లు ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఎక్కేలా నిర్మాణం చేసుకోవాలి. లేదా తూర్పు నుంచి పడమరకు ఎక్కేలా నిర్మించుకోవాలి.
  4. మెట్ల సంఖ్య కూడా బేసి సంఖ్య ఉండాలి. సున్నాతో అంతమయ్యే సంఖ్య రాకూడదు.
  5. స్పైరల్ ఆకృతిలో కొందరు మెట్లు నిర్మిస్తారు. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
  6. మెట్లు బీటలు వారితే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.
  7. వాస్తు శాస్త్రం ప్రకారం బూట్లు, చెప్పులు ఎప్పుడూ మెట్ల కింద ఉంచకూడదు. ఈ కారణంగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.
  8. వాస్తు నియమం ప్రకారం మెట్ల కింద చెత్త బుట్టలు పెట్టకూడదు. ఇలా చేస్తే ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి.
  9. వాస్తు నిబంధనల ప్రకారం కుటుంబ ఫోటోలను మెట్ల కింద ఉంచరాదు. ఇలా చేస్తే కుటుంబ కలహాలు పెరుగుతాయి.

టాపిక్