తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 5, నేటి రాశి ఫలాలు- రేపు వీళ్ళు సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు

అక్టోబర్ 5, నేటి రాశి ఫలాలు- రేపు వీళ్ళు సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు

HT Telugu Desk HT Telugu

05 October 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.10.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 5 నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 5 నేటి రాశి ఫలాలు (freepik)

అక్టోబర్ 5 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 05.10.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

వారం: శ‌నివారం, తిథి : తదియ ,

నక్షత్రం: స్వాతి , మాసం : ఆశ్వయుజం ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

గ్రహసంచారాలు ప్రయోజనమిస్తాయి. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠలు ఏర్పరచుకోగ‌లుగుతారు. సంయమనములకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించుకోవాలి. కొన్ని విష‌యాల్లో ఒకింత ఉత్సాహాలు ఏర్పడతాయి. ఖర్చులకు తగినట్లుగా ఆదాయాలుండగలవు. సంతాన పరంగా మేలు జరగగలదు. చిన్నతరహా ప్రయాణాలు ఏర్పడగలవు.

వృషభం

స్వల్ప అనారోగ్య భావనలచే దినకృత్యములన్నీ వాయిదాల మీద జరుగు సూచనలు గలవు. ఆర్థికంగా స‌మస్య‌లు ఎదురు కావ‌చ్చు. ఆరోగ్యం ప‌ట్ల కాస్త జాగ్ర‌త్త అవ‌స‌రం. ఆత్మీయుల‌ను క‌లిసి ఎన్నో విష‌యాలు చ‌ర్చిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో కాలం గ‌డుపుతారు.

మిథునం

కొన్నింట టెన్ష‌న్లు ఉంటాయి. కొన్ని ఊహించని సంఘటనలు ఎదుర్కోవలసిరావచ్చును. సుబ్రహ్మణ్య ఆరాధనలు తప్పనిసరి చేయండి. స్వవర్గమున చిన్నతరహా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసిరావచ్చును. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. పెట్టుబడులకు, అదనపు వ్యాపార ప్రారంభాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళ ఊహలు వేరు, బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఉదాసీనంగా వ్యవహరించుకొనుట మంచిది కాగలదు. ఆరోగ్య, ఆర్థిక విషయాలు అనుకూలం. సంతానంచే శుభవార్తలు వింటారు. వ్యాపార, వ్యవహారాలలో మార్పుచేర్పులకు దూరంగా ఉండండి. ఉద్యోగాలందు అదనపు పని భారమును దూరం చేసుకో గ‌లుగుతారు. పెట్టుబడులకు దూరంగా ఉండుటయే మంచిది.

సింహం

స్వల్ప అనారోగ్య భావనలు చికాకుపరచు సూచనలు గలవు. వ్యక్తిగత విషయాలలో సర్దుకుపోవలసి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ఉత్సాహకరమయిన స్థితులువంటివి ఉంటాయి. అధికారులచే ప్రశంసలు ఏర్పరచుకోగలరు. పెట్టుబడులకు, అదనపు పనులు చేపట్టుటకు ఆలోచనలు తప్పనిసరి చేయాలి. కుటుంబంలో ఉత్సాహమును ఇచ్చు వార్తలుంటాయి. తలపెట్టుకున్న ప్రయాణాలు వాయిదాపడు సూచనలు గలవు.

కన్య

బంధుమిత్రులు, కుటుంబ సభ్యులువంటి వారిచే మీ పనులలో చేర్పుమార్పులు ఏర్పడగలవు. బంగారంవంటి వాటిపై పెట్టుబడులు పెట్టు సూచనలు గలవు. వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని టెన్షన్లు ఎదుర్కోవలసి వచ్చినా ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలను చేయవలసిరావచ్చు. విద్యార్థులకు అనుకూల సమయం.

తుల

ఆర్థికపరమయిన ఒత్తిడిని ఎదుర్కో వలసివచ్చినా ఉత్సాహంగా వ్యవహరించు కోగలుగుతారు. కుటుంబ వ్యక్తుల ఉత్సాహాలలో పాలు పంచుకోవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా మధ్యమ స్థితులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలకై తలపెట్టుకున్న పనులు అనుకూలించగలవు. బంధుమిత్రులతో మనస్పర్థలు ఏర్పడు సూచనలు గలవు. ఒప్పందాలు, అనుమతులు నిరాశకు గురిచేస్తాయి.

వృశ్చికం

నిరుద్యోగులు కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల‌ సతమతమవ్వగలరు. స్పెక్యులేషన్లకు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండుట మంచిది. నూత‌న‌ ఉద్యోగ అవకాశాలు ఏర్పడగలవు. పరిచయస్తులచే ప్రయోజనాలు ఏర్పరచు మంచిది. ఉచిత సలహాలు ఇచ్చేవారు పెరుగుతారు. నిరుద్యోగులకు ప్రయోజనాలు ఏర్పడు సూచనలు వున్నాయి. ఆర్థిక అవసరాలపట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి.

ధనుస్సు

ఇంటా- బయటా వివాదాలను ఏర్పరచు అంశాలకు దూరంగా ఉంటూ లౌక్యంగా సాగాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాలో సాగ గ‌లుగుతారు. వాహన, యంత్రాదులు రిపేర్లను ఏర్పరచు సూచనలు గలవు. ఆర్థికంగా చిన్నతరహా ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చును. చెల్లింపులకు ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. అవకాశాలు చేజారినా ధైర్యంగా సాగండి, ప్రయోజనాలు పొందుతారు.

మకరం

మీ ప్రయత్నాలను వేగవంతం చేసుకోగలరు. అవకాశాలు కలిసివస్తాయి. మొండిపట్టుదలలు చూపితే పూర్తవ్వవు. అనుకున్న పనుల్ని పూర్తి చేసుకుంటారు. కుటుంబ వ్యక్తుల హోదాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికమైన పనులను చేపట్టుకుంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలు ఉంటాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు ఉంచగలుగుతారు. ఆరోగ్య, ఆర్థిక విషయాలు సంతృప్తికరం.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం మీ అవసరాలను సమర్థించుకొనునట్లు ఆదాయాలు ఉంటాయి. అధికారులతో సంయమనాలు పాటించుకోవాలి. వాద - ప్రతివాదాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీ సమర్థతపై నమ్మకం పెరుగు సంఘటనలుంటాయి. ఖర్చులందు నియంత్రణాధోరణిని తప్పనిసరి చేసుకోండి. వాగ్దానములందు జాగ్రత్తలు అవసరం. సంతాన అవసరాలను తీర్చవలసిరావచ్చును.

మీనం

కుటుంబ వ్యక్తులను ముఖ్య విషయాల్లో భాగస్తులను చేయండి. ఆలోచనల్ని తక్కువచేస్తూ ముఖ్య వ్యవహారాలను చేపట్టుకోండి. స్థిరాస్తుల వ్యవహారాల్ని కొంతకాలం వాయిదా వేసుకోండి. అవసరాలను సమర్థించుకొను నట్లు ఆదాయాలుంటాయి. అధికార్లచే చిన్నతరహా ప్రోత్సాహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, అవివాహితులు నిరాశలకు దూరంగా ఉంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం