Evening Things: సాయంత్రం పూట చేయకూడని పనులు ఇవే, వీటిని చేస్తే ఆర్థికంగా నష్టపోతారు
Evening Things: హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని పనులు సాయంత్రం పూట చేయకూడదు. ఏ ఏ పనులు దీపాలు పెట్టాక చేయకూడదో తెలుసుకోండి.
Evening Things: చాలాసార్లు తెలిసీ తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటాను. ముఖ్యంగా సాయంత్రం పూట చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని సాయంత్రం వేళ చేయడం అశుభం. అలాగే అది పేదరికానికి దారితీస్తుంది. ఇల్లు సంతోషంగా ఉండాలన్నా, కుటుంబీకులు ఆనందంగా ఉండాలన్నా కొన్ని రకాల పనులను సాయంత్రం వేళ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని రకాల పనులు చేస్తే మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు పేదరికం అనుభవించే అవకాశం ఉంది. సాయంత్రం పూట ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి.
అప్పు ఇవ్వడం
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం అయ్యాక డబ్బు లావాదేవీలు చేయడం మంచిది కాదు. ఎవరికీ చిన్న మొత్తంలో కూడా అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించలేరని అంటారు.
ఇల్లు తుడవడం
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు లేదా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఊడ్చకూడదు. సాయంత్రం పూట తుడవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని... దీని వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతారు.
తులసి ఆకులను తెంపడం
తులసి మొక్క సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాము. సాయంత్రం పూట తులసి మొక్కను తాకకూడదు. వాటి ఆకులను తెంపడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించదు. సాయంత్రం అయ్యాక తులసి మొక్కకు నీరు పోయడం లేదా ఆ మొక్కను తాకడం వంటి పనులు ఇప్పుడు చేయకండి.
గొడవలు పడడం
సాయంత్రం పూట భజనలు, కీర్తనలు పూజలతో ఎంతోమంది గడుపుతూ ఉంటారు. హిందూమతంలో కూడా ఐదు గంటల తర్వాత పూజ చేసే సంప్రదాయం ఉంది. అలాంటి సమయాల్లో ఇంట్లో గొడవలు జరగడం మంచిది కాదు. ఇలా గొడవలు జరగడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది పేదరికానికి దారితీస్తుంది.
చీకటిగా ఉండకూడదు
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీకటి ఉండకూడదు. చిన్న చిన్న దీపాలను పెట్టుకోవడం చాలా అవసరం. హిందూ శాస్త్రం ప్రకారం దేవతలు సాయంత్రం వేళ భూమిపైకి వచ్చి పర్యటనలు చేస్తారని అంటారు. వారు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చీకటిగా అనిపిస్తే ఇంతకుముందు ఇంట్లోకి అడుగుపెట్టరు. సాయంత్రం వేళ ఇల్లు చీకటిగా ఉన్నా లేదా గొడవలు పడుతున్నాన అది ప్రతికూల ఎనర్జీని మోసుకువస్తుంది. కాబట్టి సాయంత్రం అయ్యాక ఇల్లు అంతా వెలుగులు చిమ్మేలా చూడండి. గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.