Panchamrutham Benefits : పంచామృతం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా-panchamrutham benefits panchamrutham has special importance in ayurveda know how to make it in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Panchamrutham Benefits : పంచామృతం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా

Panchamrutham Benefits : పంచామృతం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా

Anand Sai HT Telugu
Jun 11, 2024 09:30 AM IST

Panchamrutham Benefits In Telugu : పంచామృతం దేవుడికి మాత్రమే కాదు.. ఆయుర్వేదం ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇందులో కలిపే పదార్థాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పంచామృతం ప్రయోజనాలు
పంచామృతం ప్రయోజనాలు

భగవంతుని నైవేద్యంగా తయారుచేసే పంచామృతానికి ఆధ్యాత్మికతలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాల గని. పంచామృతం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయో చూద్దాం..

పంచామృతం పేరు వినని వారు చాలా తక్కువ. హిందువులలో పూజకు పంచామృతం అవసరం. పంచామృతం లేని పూజ లేదని చెప్పవచ్చు. పంచామృతం రెండు పదాల నుండి ఉద్భవించింది. పంచ అంటే 5, అమృత అంటే అమరత్వం అంతిమంగా ఇందులో అన్నీ ఉన్నాయని అర్థం. దేవుడికి సమర్పించే ఈ ప్రత్యేక ద్రవ ఆహారంలో 5 పదార్థాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ 5 పదార్థాలు ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

పంచామృతం ఎలా తయారు చేయాలి?

కావలసినవి : పాలు - 1 కప్పు, పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, తేనె - 1 టేబుల్ స్పూన్, చక్కెర - 1 టేబుల్ స్పూన్

తయారుచేసే విధానం : పాలను మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలపండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో పాలు కలపండి. దాన్ని బాగా తిప్పండి. ఇప్పుడు పంచామృతం రెడీ అయిపోయింది. అయితే దీనిని రాగి పాత్రలో పోసి.. తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

పంచామృతం గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.. పంచామృతంలో కలిపిన పదార్థాల వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం..

పంచామృత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

పాలు : ఆయుర్వేదంలో పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీర కణజాలాలను పోషిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడుతుంది.

పెరుగు : ఇందులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నెయ్యి : ఆయుర్వేదంలో నెయ్యికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను పెంచుతుంది. మొత్తం రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఇతర పదార్థాలతో కలిపితే దాని ఔషధ గుణాలు మెరుగుపడతాయి.

తేనె : తేనె యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది సహజ శక్తి బూస్టర్ అని నమ్ముతారు. శరీర కణజాలాలను రిలాక్స్ చేస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

పంచదార : మితంగా తీసుకున్నా పంచామృతంలోని చక్కెర శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.

ఈ అంశాలన్నింటికీ ఆయుర్వేదంలో ప్రత్యేకత ఉంది.  వీటన్నింటి కలయిక చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీవితానికి కూడా అమృతం లాంటిది. పంచామృత వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పంచామృతానికి హిందూ పూజలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పంచామృతం కావాలంటే రోజూ తీసుకోవచ్చు. ఆయుర్వేదం.. గర్భధారణ సమయంలో తొమ్మిది నెలలపాటు పంచామృతం తీసుకోవచ్చని సిఫార్సు చేస్తుంది.

Whats_app_banner