Tulasi plant: ఎండిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి? దాన్ని తొలగించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు-avoid these mistakes while to remove dried tulasi plant ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Plant: ఎండిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి? దాన్ని తొలగించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

Tulasi plant: ఎండిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి? దాన్ని తొలగించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

Gunti Soundarya HT Telugu
Jun 05, 2024 07:17 PM IST

Tulasi plant: అనివార్య కారణాల వల్ల మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే దాన్ని ఏం చేస్తున్నారు? పారేస్తున్నారా? అలా ఎప్పటికీ చేయకూడదు. ఆ మొక్కను ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం.

తులసి మొక్క
తులసి మొక్క

Tulasi plant: హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వాస్తు శాస్త్రానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఉంచే ప్రదేశం, దిశను గుర్తించుకోవాలి. వాస్తు ప్రకారం వస్తువులు సరైన స్థలంలో ఏర్పాటు చేసినప్పుడే అది శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాంటి వాటిలో తులసి మొక్క ఒకటి.

తులసి మొక్క లేని ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో తులసి ఉందంటే లక్ష్మీదేవి ఉన్నట్టే భావిస్తారు. అందుకే ఇంట్లో తులసిని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పూజలు అందిస్తారు. తులసి మొక్కలోని ఔషధ గుణాలతో పాటు పాజిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తుంది. తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతుంది.

అటువంటి సమయంలో తులసి మొక్కను తొలగించేటప్పుడు కొన్ని విషయాలు తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మీరు అనుసరించే పద్ధతులు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. తులసి మొక్క ఎండిపోయాక ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంచవద్దు

హిందూ మతం ప్రకారం ఇంట్లో తులసిని నాటడం చాలా శుభప్రదమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తులసి మొక్క ఎండిపోతే అది అశుభంగా పరిగణిస్తారు. ఇలాంటి మొక్క ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. వెంటనే తొలగించాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఎండిపోయిన తులసి మొక్క స్థానంలో పచ్చగా ఉండే మరొక మొక్కను నాటాలి.

తులసి మొక్క కాల్చకూడదు

సాధారణంగా ఎండిపోయిన మొక్కలు, కొమ్మలు ఏవైనా ఉంటే మంట పెట్టి కాల్చేస్తారు. కానీ ఎండిన తులసి మొక్క విషయంలో అలాంటి తప్పు అసలు చేయకూడదు. అలాగే దాన్ని విసిరేయకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. అందుకే ఎండిన తులసి మొక్కను పారవేసేందుకు బదులుగా భూమిలో పాతిపెట్టడం మంచిది.

రాత్రిపూట ఆకులు కోయకూడదు

ఇంట్లో తులసి నాటినట్లయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. తులసి మొక్క ఆకులు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పొరపాటున కూడా తులసి ఆకులు కోయకూడదు. అలాగే ఆదివారం, ఏకాదశి తిథిలో కూడా తులసి ఆకులు కోయడం మంచిది కాదు.

తులసి ఆకులు తొక్కకూడదు

తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే తులసి ఆకులు చేజారిపోయి నేల మీద పడినప్పుడు వాటిని తొక్కకూడదు. మీకు నేలపై తులసి ఆకులు కనిపిస్తే వాటిని వెంటనే మట్టిలో పాటిపెట్టాలి. వాటిని తొక్కడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది.

తులసి కోట అపరిశుభ్రంగా ఉండకూడదు

తులసి పవిత్రమైనది. అందుకే తులసి మొక్కను భూమిలో కాకుండా కుండీలో ఏర్పాటు చేసుకుంటారు. తులసి ఎప్పుడు ఎత్తుగా ఉండే వాటిలోనే ఉండాలి. అలాగే మొక్క చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు పూజలు చేస్తూ దీపం వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా మీ మీద ఉంటాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇల్లు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది.

Whats_app_banner